Page Loader
ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయిస్తాం: న్యాయమూర్తి మెకాఫీ
ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం

ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారం చేయిస్తాం: న్యాయమూర్తి మెకాఫీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 01, 2023
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జార్జియా ఎన్నికల కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు గురువారం న్యాయమూర్తి మెకాఫీ తెలిపారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా యూ ట్యూబ్ సహా రేడియో, స్టిల్ ఫోటోగ్రఫీ, టీవీల్లోనూ లైవ్ అందిస్తామన్నారు. సెప్టెంబర్ 6న బుధవారం ఫుల్టన్ కౌంటీ సుపీరియర్ కోర్ట్ జడ్జి స్కాట్ మెకాఫీ, డొనాల్డ్ ట్రంప్ సహా మరో 18 మందిపై విచారణ చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జార్జియా ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించలేదని, ఈ కేసులో తాను నిర్దోషినని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. వచ్చేవారం విచారణకు తాను హాజరుకావట్లేదని ట్రంప్ అన్నారు. అట్లాంటాలోని ఫుల్టన్ కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు ట్రంప్ పై విచారణ జరగనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జార్జియా కేసులో నేను నిర్దోషిని: ట్రంప్