
వ్లాదిమిర్ పుతిన్ బాటలోనే జిన్‌పింగ్.. భారత్‌లో జరిగే G-20 సమావేశాలకు దూరం
ఈ వార్తాకథనం ఏంటి
G-20 శిఖరాగ్ర సమావేశాలకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. దిల్లీ వేదికగా మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మకమైన సమ్మిట్ కు గైర్హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆయనకు బదులుగా చైనా తరపున ప్రీమియర్ లీ కియాంగ్ హాజరుకానున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికే G-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దూరమయ్యారు.మరోవైపు అక్టోబరులో చైనాలో పుతిన్ పర్యటించనున్నారు.ఈ మేరకు చైనా, రష్యాల మధ్య బంధం బలపడుతోంది.
ఇంకోవైపు చైనా స్టాండార్ట్ మ్యాప్ పేరిట కవ్వింపులకు పాల్పడుతోంది.సెప్టెంబర్ 9, 10 తేదీల్లో G-20 దేశాల సమావేశాలకు అగ్రదేశాలు వెనువెంటనే తప్పుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు జిన్‌పింగ్ దూరం
Chinese President Xi Jinping likely to skip G20 Summit in India, reports Reuters pic.twitter.com/l2eNZjSnNx
— ANI (@ANI) August 31, 2023