
Donald Trump: ట్రంప్‌ను హతమార్చుతానంటూ వీడియో.. 32 ఏళ్ల వ్యక్తి అరెస్టు!
ఈ వార్తాకథనం ఏంటి
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బెదిరింపులు రావడం అమెరికాలో కలకలం రేపుతోంది.
ట్రంప్‌ను హతమార్చుతానంటూ షాన్ మోన్పర్(32)అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
ఈ వీడియో ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి రావడంతో వెంటనే చర్యలు చేపట్టారు.
అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అమెరికా న్యాయశాఖ ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. షాన్ మోన్పర్ తనను తాను 'మిస్టర్ సాతాన్'గా పేర్కొంటూ పలు వివాదాస్పద వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.
బట్లర్ టౌన్‌షిప్‌కు చెందిన ఈ యువకుడు, ట్రంప్‌తో పాటు డోజ్ శాఖ సారథి ఎలాన్ మస్క్ తదితర ప్రముఖుల పేర్లను కూడా వీడియోల్లో ప్రస్తావించాడు.
తమ మార్గానికి అడ్డుగా నిలిచిన వారిని హతమార్చుతానంటూ స్పష్టం చేశాడు.
Details
అదుపులోకి తీసుకున్న ఎఫ్‌బీఐ అధికారులు
2024 మార్చి 4న పోస్ట్ చేసిన ఓ వీడియోలో ట్రంప్‌ను తానే హత్య చేస్తానని ప్రకటించాడు.
ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియోలు అధికారుల దృష్టికి రావడంతో వెంటనే అప్రమత్తమైన ఎఫ్‌బీఐ అతడిని అదుపులోకి తీసుకుంది.
అదనంగా గతేడాది ట్రంప్‌పై పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నానికి షాన్ మోన్పర్‌కు సంబంధాలున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఆ సమయంలో ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా ఓ భవనం పై నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు.
ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. వెంటనే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది స్పందించి ఆయనను రక్షించారు.
ట్రంప్ జనవరిలో ప్రమాణస్వీకారం చేయడానికి కొద్దిసేపటి ముందు షాన్ ఒక తుపాకీ కొనుగోలు చేసినట్లు సమాచారం.
Details
ధర్యాప్తు చేస్తున్న అధికారులు
అంతేకాదు, పదవిలోకి వచ్చిన తర్వాత కూడా అతడు మరిన్ని తుపాకీలు, మందు సామగ్రిని సేకరించినట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయంలో అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ స్పందిస్తూ, హత్య లేదా సామూహిక హింసకు సంబంధించిన బెదిరింపులు చేసే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
ఇంకొక ఘటనలో, ట్రంప్ ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో గోల్ఫ్ ఆడుతుండగా, ఒక వ్యక్తి తుపాకీతో ఫెన్సింగ్ వరకు వచ్చి తన ఉనికిని తెలియజేశాడు.
భద్రతా బలగాలు వెంటనే స్పందించి అతడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నాయి. ఈ విధంగా, ట్రంప్‌పై మళ్లీ ముప్పు పొంచి ఉందనే ఆందోళన నెలకొంది.
సంబంధిత అధికారులు ఈ ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.