US Aircraft: ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న అమెరికా విమానం.. కేసీ-135 వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన అనేక విమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతోంది. టెహ్రాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోయిన అమెరికా కేసీ-135ఆర్ ఇంధన సరఫరా విమానం తాజాగా యునైటెడ్ కింగ్డమ్‌లోని ఆర్‌ఏఎఫ్ మిల్డెన్‌హాల్ పైగా ప్రయాణిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈవిమానానికి తూట్లుపడగా.. పైభాగంలో మరమ్మతులు చేసిన గుర్తులు కనిపించాయి. ఈ దృశ్యాలను యూకేకు చెందిన విమాన చిత్రకారుడు ఆండ్రూ మెక్‌కెల్వీ పంచుకున్నారు. గత నెలలో సౌదీ అరేబియాలోని ఒక వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి జరిపిన సమయంలో ఐదు కేసీ-135ఇంధన సరఫరా విమానాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా కనిపించిన ఈ విమానం కూడా అదే దాడిలో నష్టపోయిన వాటిలో ఒకటై ఉండొచ్చని యూకే అధికారులు అనుమానిస్తున్నారు.
వివరాలు
అమెరికాకు చెందిన మొత్తం 39 విమానాలు ధ్వంసం
యుద్ధంలో దెబ్బతిన్న విమానాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి అమెరికా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికాకు చెందిన మొత్తం 39 విమానాలు ధ్వంసమైనట్లు పలు వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరో పది విమానాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. కూలిన వాటిలో ఒక ఏ-10 యుద్ధవిమానం, నాలుగు ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానాలు ఉన్నట్లు సమాచారం. అలాగే అత్యాధునిక ఐదో తరం యుద్ధవిమానంగా భావించే ఎఫ్-35 స్టెల్త్ విమానం కూడా టెహ్రాన్ దాడుల్లో నష్టపోయినట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దెబ్బతిన్న కేసీ-135 విమానం వీడియో వైరల్
Battle-damaged USAF KC-135 tanker returning from the Middle East sporting a number of patched shrapnel holes.
— OSINTtechnical (@Osinttechnical) April 12, 2026
Likely one of the tankers damaged in an Iranian missile/drone attack on Prince Sultan Airbase. pic.twitter.com/idHs3DClIG