
Viral Video: 'ఎవరూ సహాయం చేయలేదు': కెనడాలో భారతీయ యువతిపై దాడి.. వైరల్ అయిన వీడియో..
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో భారత వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా, ఖలిస్తానీ వేర్పాటువాదులు గతంలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి.
హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా, కెనడాలోని కాల్గరీలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌ వ్యాలీ కాలేజ్ రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తి భారతీయ యువతిపై హింసాత్మక దాడికి పాల్పడ్డాడు.
ప్లాట్‌ఫామ్‌లో ఉన్న ఆ యువతి గొంతు పట్టుకుని హత్యాయత్నం చేశాడు.
వివరాలు
తెలియని బాధిత యువతి వివరాలు
ఈ దృశ్యాలు కెమెరాలో రికార్డ్ అవ్వగా, సంబంధిత వీడియో వైరల్‌గా మారింది.
అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నప్పటికీ, వారు ఘటనను అడ్డుకునేందుకు ముందుకు రాలేదు.
అయితే, కొద్దిసేపటికి గుంపు పెరగడంతో నిందితుడు యువతిని వదిలి అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
దాడికి గల అసలు కారణం ఇంకా వెల్లడికాలేదు. అలాగే, బాధిత యువతి వివరాలు కూడా తెలియరాలేదు.
ఇదే తరహాలో, గతేడాది డిసెంబర్‌లో కెనడాలోని సర్రే ప్రాంతంలో హర్యానా కురుక్షేత్ర జిల్లా తస్కా మిరాజీ గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహిళను దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన నమోదైంది.
డిసెంబర్ 14న గిల్డ్‌ఫోర్డ్ ప్రాంతంలోని ఆమె అద్దె ఇంట్లో దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
Visuals have emerged from the City Hall/Bow Valley College Train Station in Calgary, Canada, where a man violently pushed a girl on the platform. Shockingly, no one nearby stepped in to help her. Several social media posts claim that the girl is of Indian origin. pic.twitter.com/ABSvrj7ZoZ
— Gagandeep Singh (@Gagan4344) March 24, 2025