LOADING...
Nepal: నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలు.. ప్రభుత్వ భవనాలపై దాడులు, ఎయిర్‌పోర్టుల మూసివేత
నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలు.. ప్రభుత్వ భవనాలపై దాడులు, ఎయిర్‌పోర్టుల మూసివేత

Nepal: నేపాల్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలు.. ప్రభుత్వ భవనాలపై దాడులు, ఎయిర్‌పోర్టుల మూసివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌ (Nepal)లో నిరసనలు ఉధృతంగా కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రభుత్వ వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళనలు ఊపందుకున్నాయి. వేలాదిమంది యువకులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని కేపీ ఓలి (KP Oli) రాజీనామా చేయాలంటూ రాజధాని కాఠ్మాండూ (Kathmandu)లోని పార్లమెంట్‌ వద్ద రోడ్లను దిగ్బంధించారు.

Details

నేతల ఇళ్లపై దాడులు

నిరసనకారులు పలువురు మంత్రులు, రాజకీయ నాయకుల నివాసాలపై దాడి చేసి, లూటీకి పాల్పడ్డారు. మాజీ ప్రధాన మంత్రికి చెందిన ఇల్లు కూడా దాడుల పాలైంది. అక్కడి నుంచి నోట్ల కట్టలు తీసి గాల్లోకి విసిరేశారు. అంతేకాదు, ప్రధాని ఓలి అధికారిక నివాసంలోకి చొరబడి ధ్వంసం చేసి, ఆ ఇంటిని మంటలు అంటించారు. దీంతో రాజధానిలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా దేశంలోని అన్ని విమానాశ్రయాలను మూసివేశారు.

Details

 అధ్యక్షుడు సహా పలువురు నేతల ఇళ్లపై దాడులు

నిరసనకారులు నేపాల్‌ అధ్యక్షుడు రామ్‌ చంద్ర పౌడెల్‌ అధికారిక నివాసంతో పాటు, మాజీ ప్రధాన మంత్రి పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ), యూఎమ్‌ఎల్‌ నేత మహేష్‌ బాస్నెట్‌, నేపాలీ కాంగ్రెస్‌ నేత గగన్‌థాపా, మాజీ హోంమంత్రి రమేష్‌ లేఖక్‌, నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదూర్‌ డ్యూబా, మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్‌, అలాగే కాఠ్మాండులోని నేపాలీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశారు. ఈ భవనాలకు నిప్పు పెట్టడంతో ఆఫీసులు మంటల్లో దగ్ధమవుతున్నాయి. యూఎమ్‌ఎల్‌ పార్టీ కార్యాలయం కూడా మంటల్లో కాలిపోతోంది.

Details

సోషల్ మీడియా బ్యాన్‌ ఎత్తివేత తర్వాత కూడా నిరసనలు

ప్రభుత్వం సోషల్ మీడియా బ్యాన్‌ను ఎత్తివేసినప్పటికీ ఆందోళనలు తగ్గలేదు. ప్రతిరోజూ యువత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. ప్రధాని ఓలి రాజీనామా డిమాండ్‌తో పార్లమెంట్‌ చుట్టూ ముట్టడులు కొనసాగుతున్నాయి. ఆల్ పార్టీ మీటింగ్‌ పిలుపు పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుత సంక్షోభంపై చర్చించేందుకు ప్రధాని 'కేపీ ఓలి' అన్ని రాజకీయ పార్టీలతో ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు.