Page Loader
హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై
లాటరీ విధానానికి బైబై

హెచ్‌-1B వీసాపై వివేక్‌ రామస్వామి సంచలన వ్యాఖ్యలు.. లాటరీ విధానానికి బైబై

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 18, 2023
11:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థి వివేక్‌ రామస్వామి హెచ్‌-1బీ వీసాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే వీసాల జారీలో లాటరీ విధానానికి గుడ్ బై చెబుతామని రిపబ్లికన్‌ పార్టీ నేత, ఇండో అమెరికన్‌ రామస్వామి అన్నారు. కేవలం ప్రతిభ ఆధారిత విధానాన్నే అమల్లోకి తీసుకొస్తామన్నారు. ప్రస్తుత విధానంలో వీసాలు స్పాన్సర్‌ చేసే కంపెనీకే లబ్ధి ఎక్కువగా ఉందన్నారు. అమెరికాలోని సంస్థలు విదేశీ సాంకేతిక నిపుణులకు హెచ్‌-1B వీసా అందిస్తుంటాయి. తద్వారా ఉద్యోగాల్లో భర్తీ చేస్తాయి. భారత్‌, చైనీయులు ఈ వీసా సాయంతోనే అగ్రరాజ్యంలో కొలువులు పొందుతున్నారు. గతంలో రామస్వామికి చెందిన రోవియంట్‌ సైన్సెస్‌, విదేశీ ఉద్యోగుల నియామకానికి హెచ్‌-1B వీసాలను 29 సార్లు వినియోగించుకోవడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వివేక్ రామస్వామి చేసిన ట్వీట్