Vladimir Putin: రష్యా ఎన్నికల్లో పుతిన్ ఘనవిజయం.. మళ్లీ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నిక
రష్యాలో ఆదివారం జరిగిన ఎన్నికలలో వ్లాదిమిర్ పుతిన్ విజయం సాధించారు.దీంతో పుతిన్ ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సోవియట్ తర్వాత ఆ స్థాయిలో విజయం సాధించిన నేతగా పుతిన్ నిలిచారు.71ఏళ్ళ వ్లాదిమిర్ పుతిన్ఈ ఎన్నికలలో 88% ఓట్లను కైవసం చేసుకున్నారు. కమ్యూనిస్ట్ అభ్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్ కేవలం 4%కంటే తక్కువతో రెండవ స్థానంలో నిలిచారు. కొత్తగా వచ్చిన వ్లాడిస్లావ్ దావన్కోవ్ మూడవ స్థానంలో నిలిచారు.అల్ట్రా-నేషనలిస్ట్ లియోనిడ్ స్లట్స్కీ నాల్గవ స్థానంలో నిలిచారు. 1999 నుంచి దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్నపుతిన్.. తాజా విజయంతో మరో ఆరేండ్లపాటు అదే పదవిలో ఉండనున్నారు. దీంతో రష్యాలో ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా జోసెఫ్ స్టాలిన్‌ను అధిగమించనున్నారు. కాగా,మే 7న ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది .