Page Loader
Bluesky: అనతికాలంలోనే ప్రాచుర్యం పొందిన కొత్త సామాజిక మాధ్యమం 'బ్లూ స్కై'.. యూజర్లు 'ఎక్స్‌'ను ఎందుకు వీడుతున్నారు?
అనతికాలంలోనే ప్రాచుర్యం పొందిన కొత్త సామాజిక మాధ్యమం 'బ్లూ స్కై'.. యూజర్లు 'ఎక్స్‌'ను ఎందుకు వీడుతున్నారు?

Bluesky: అనతికాలంలోనే ప్రాచుర్యం పొందిన కొత్త సామాజిక మాధ్యమం 'బ్లూ స్కై'.. యూజర్లు 'ఎక్స్‌'ను ఎందుకు వీడుతున్నారు?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 18, 2024
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష ఎన్నికల తరువాత డొనాల్డ్ ట్రంప్ విజయం, అలాగే ఎలాన్ మస్క్ షేర్లు రాణించడం అందరికీ తెలిసిందే. అయితే, ఎలాన్ మస్క్‌ను కలవరపెడుతున్న విషయం 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) వేదికను పెద్ద సంఖ్యలో అమెరికన్లు విడిచిపెడుతుండటమే. వీరు బ్లూ స్కై (Bluesky) అనే కొత్త సామాజిక మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నారు, ఇది ఇప్పటివరకు 10 మిలియన్ల సబ్‌స్క్రైబర్లతో భారీ వృద్ధిని సాధించింది.

వివరాలు 

ఎక్స్‌కు ఎదురవుతున్న సమస్యలు 

రాజకీయ అనుబంధం: ట్రంప్‌ విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఆయన ప్రచారానికి భారీ నిధులు సమకూర్చడంతో పాటు బలమైన మద్దతు అందించారు. దీనివల్ల కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఎలాన్ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతో, 'ఎక్స్' రైట్-వింగ్ భావజాలానికి మాత్రమే మొగ్గు చూపుతుందని భావించిన వారు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. టర్మ్స్ అండ్ కండీషన్స్: 'ఎక్స్' తాజా నిబంధనలు కూడా వినియోగదారుల ఆగ్రహానికి కారణమయ్యాయి. మస్క్ రూపొందించిన ఏఐ చాట్‌బాట్ 'గ్రోక్'కు వినియోగదారులు పోస్టు చేసే కంటెంట్‌ను శిక్షణ కోసం ఉపయోగిస్తామని ప్రకటించడాన్ని చాలా మంది విమర్శించారు.

వివరాలు 

బ్లూ స్కై విశేషాలు 

బ్లూ స్కైను ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సీ 2019లో ఇంటర్నల్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రధాన సోషల్ మీడియా వేదికగా మారింది. ఇదే బ్లూ స్కై ప్రత్యేకత.. సూక్ష్మనిర్వాహక వ్యవస్థ: బ్లూ స్కై యూజర్ల డేటాను సంస్థ సర్వర్‌పై నిల్వ చేయదు. వినియోగదారులు స్వయంగా తమ సర్వర్‌ను నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తుంది. స్వతంత్ర ఫీడ్ కస్టమైజేషన్: యూజర్లు తమ ఫీడ్‌ను పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు, ఇది ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు విభిన్నంగా ఉంటుంది. ఫ్రీడ్‌మ్ ఫ్రం అల్గారిథమ్ బైయాస్: బ్లూ స్కైలో పోస్టుల ప్రాధాన్యం యూజర్ నిర్ణయంతో ఉంటుంది, ప్రత్యేకించి రాజకీయంగా మోస్తరు నిష్పక్షపాత ధోరణి ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

వివరాలు 

రెస్పాన్స్ 

అమెరికా ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ టాప్ చార్ట్‌ల్లో బ్లూ స్కై దూసుకుపోయింది. ఎన్నికల తరువాత స్నేహితులు, జర్నలిస్టులు, అథ్లెట్లు ఈ వేదికను భారీగా ఆశ్రయిస్తున్నారు. సెప్టెంబర్‌లో 10 మిలియన్ యూజర్లతో ప్రారంభమైన బ్లూ స్కై, ప్రస్తుతం 19 మిలియన్లకు చేరుకుని వేగంగా ముందుకు సాగుతోంది. భవిష్యత్తు దిశ తప్పనిసరిగా, సామాజిక మాధ్యమాల మధ్య పోటీ పెరుగుతోంది. ఎలాన్ మస్క్ 'ఎక్స్'ను తిరిగి సాధారణ ప్రజల హృదయాలకు చేరేలా చేయగలడా లేదా అనేది చూడాల్సిన విషయం. బ్లూ స్కై మాత్రం ప్రస్తుతం ప్రత్యామ్నాయ వేదికగా మెరుగు కలిగిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తోంది.