Page Loader
Chronic Venous Insufficiency:ట్రంప్ కు దీర్ఘకాలిక సిరల లోపం అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎలాంటి వారికి వస్తుంది?లక్షణాలు ఏమిటి?
ట్రంప్ కు దీర్ఘకాలిక సిరల లోపం అంటే ఏమిటి? ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?

Chronic Venous Insufficiency:ట్రంప్ కు దీర్ఘకాలిక సిరల లోపం అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎలాంటి వారికి వస్తుంది?లక్షణాలు ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం విషయంలో వైట్ హౌస్ లో ఆందోళన పెరిగింది. ఇప్పటికే కాళ్లలో వాపుతో బాధపడుతున్న ట్రంప్ కు మరో కొత్త ఆరోగ్య సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయిందని అధికారికంగా వెల్లడించారు. ట్రంప్ కు దీర్ఘకాలిక సిరల లోపం (Chronic Venous Insufficiency) ఉన్నట్లు వైట్ హౌస్ ధృవీకరించింది. ఇది వృద్ధులలో సాధారణంగా కనిపించే వ్యాధి అని వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తామని అధికారులు తెలిపారు.

వివరాలు 

కాళ్లలో వాపుకు ప్రధాన కారణం దీర్ఘకాలిక సిరల లోపం 

వైద్య పరీక్షల్లో ట్రంప్ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి తీవ్రమైన సమస్యలు గుర్తించలేదని వైట్ హౌస్ వెల్లడించింది. అన్ని పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాళ్లలో వాపుకు ప్రధాన కారణం దీర్ఘకాలిక సిరల లోపమేనని వైద్యులు స్పష్టం చేశారు. ఈ సమస్య 70 ఏళ్లకు పైబడిన వయసులో సాధారణంగా కనిపించేది. కాళ్ల వాపుతో బాధపడుతున్న ట్రంప్ వైద్య పరీక్షలు చేయించుకోగా.. అందులో ఈ కొత్త వ్యాధి నిర్ధారణ అయినట్లు వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది.

వివరాలు 

ట్రంప్ కి వయసుతో సంబంధించి కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు

ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని వైట్ హౌస్ స్పష్టం చేసింది. మీడియాలో ట్రంప్ చేతిపై గాయం, కాళ్ల వాపు గురించి అనేక ఊహాగానాలు ప్రచారం కావడాన్ని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలిన్ లెవిట్ ఖండించారు. అధ్యక్షుడు తన ఆరోగ్యంపై సత్యమైన సమాచారం అందించాలని కోరినట్లు తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన వివరాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వయసుతో సంబంధించి కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. ట్రంప్ కు డీప్ వెన్ థ్రాంబోసిస్ (DVT) లేదా ఇతర ధమనుల వ్యాధులకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు లేవని స్పష్టం చేశారు.

వివరాలు 

గుండెకు రక్తం తిరిగి వెళ్లే ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే దీర్ఘకాలిక సిరల లోపం

ఇటీవల ట్రంప్ కాళ్ల కింది భాగంలో స్వల్ప వాపు కనిపించిందని, కొన్ని వీడియోల్లో ఆయన నడవడంలో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. కాళ్ల సిరల ద్వారా గుండెకు రక్తం తిరిగి వెళ్లే ప్రక్రియలో అంతరాయం ఏర్పడితే దీర్ఘకాలిక సిరల లోపం సమస్య తలెత్తుతుందని వైద్యులు వివరించారు. ఈ వ్యాధి ముఖ్యంగా వృద్ధుల్లో కనిపించే సాధారణ సమస్యగా తెలిపారు. ట్రంప్ చేతుల్లో కనిపించిన స్వల్ప గడ్డను 'తేలికపాటి మృదు కణజాల ఇన్‌ఫ్లమేషన్'గా వైద్య నిపుణులు అభివర్ణించారు.

వివరాలు 

దీర్ఘకాలిక సిరల లోపం అంటే ఏమిటి? 

ఈ వ్యాధిలో కాళ్లలోని సిరల ద్వారా రక్తం సరైన రీతిలో గుండెకు తిరిగి వెళ్లలేకపోతుంది. కవాటాల పనితీరులో సమస్యలు రావడంతో రక్తం కాళ్లలోనే నిల్చి పోతుంది. దీంతో కాళ్లలో వాపు, నొప్పి, చర్మ మార్పులు ఏర్పడతాయి. దీర్ఘకాలిక సిరల లోపం లక్షణాలు: పాదాలు, చీలమండల వద్ద వాపు రావడం ఎక్కువ సేపు నిలబడినప్పుడు లేదా నడిచినప్పుడు నొప్పి, భారంగా అనిపించడం చర్మం మార్పుల వల్ల దురద, జలదరింపు చర్మ రంగు మారడం, బూడిద లేదా ముదురు రంగులోకి మారడం చర్మం మందంగా మారడం వక్రీకృతమైన, ఉబ్బిన సిరలు కనిపించడం చీలమండల చుట్టూ గాయాలు ఏర్పడి క్రమంగా బాధించటం