Train Force: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌కు వెళ్లనున్న ఫోర్స్ వన్ సైనిక రైలు విశేషాలేంటో తెలుసా
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21 నుంచి 23 వరకు పోలాండ్, ఉక్రెయిన్‌లలో పర్యటించనున్నారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌లో వైమానిక దాడుల కారణంగా, విమానంలో ప్రయాణించడం సురక్షితం కాదు, అందుకే ప్రధానమంత్రి మోదీ విలాసవంతమైన రైలు ఫోర్స్ వన్‌లో కీవ్ చేరుకుంటారు. జో బైడెన్, మాక్రాన్, ఓలాఫ్ స్కోల్జ్ వంటి అనేక మంది ప్రపంచ నాయకులు ఈ రైలులో ప్రయాణించారు. ట్రైన్ ఫోర్స్ వన్ అనేది అత్యాధునిక భద్రతా చర్యలతో రూపొందించబడిన రైలు.దీనిని ఉక్రెయిన్ రైల్వే కంపెనీ ఉక్ర్జాలిజ్నిట్సా నిర్మించింది. కీవ్ చేరుకోవడానికి ప్రధాని మోదీ ఈ రైలులో 10 గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుంది.
బైడెన్ కృతజ్ఞతా పత్రం
ప్రయాణ సమయం ఎక్కులైనప్పటికీ, ఈ రైలులో ప్రధాని మోదీ వంటి పెద్ద నాయకులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు లోపలి భాగం కూడా మెరుగ్గా డిజైన్ చేయబడింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కీవ్‌ను సందర్శించినప్పుడు, అయన ఈ రైలులో ప్రయాణించాడు. 20 గంటల పాటు రైలులో ప్రయాణించిన అనంతరం, బైడెన్ రైలులో సౌకర్యాలకు ముగ్దుడై ప్రశించడమే కాకుండా సిబ్బందికి కృతజ్ఞతా పత్రాన్ని కూడా ఇచ్చాడు. ఈ లగ్జరీ రైలును మొదట క్రిమియాకు వచ్చే పర్యాటకుల కోసం తయారు చేశారు.కానీ 2014లో, రష్యా క్రిమియాను ఆక్రమించినప్పుడు, వాటిని మళ్లీ వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు.
రైలులో ప్రధాని మోదీ చరిత్రాత్మక ప్రయాణం
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత రోడ్లు, విమాన మార్గాలు సురక్షితంగా లేనప్పుడు, ప్రపంచ నాయకులను ఉక్రెయిన్‌కు తీసుకురావడానికి ఈ రైలు అత్యంత సురక్షితమైన మార్గంగా మారింది. ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటనపై ప్రపంచ దేశాలు ఓ కన్నేసి ఉంచాయి. గత నెలలో ప్రధాని మోదీ రష్యాకు వెళ్లినప్పుడు పాశ్చాత్య దేశాలు భిన్నమైన కోణంలో చూశాయి. రష్యా పర్యటన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సంతులిత పర్యటన. ఎందుకంటే భారతదేశం ఈ యుద్ధంలో తటస్థంగా ఉంటూ, ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాన్ని సూచించింది. ఈ ముఖ్యమైన ప్రయాణంలో ప్రధాని మోదీ రైలు ప్రయాణం మరింత చారిత్రాత్మకమైనది.
7 గంటల పాటు ఉక్రెయిన్‌లో మోదీ
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆగస్టు 21 న పోలాండ్‌లో తన సమావేశాల తర్వాత ప్రధాని మోదీ ఆగస్టు 22 న ఉక్రెయిన్‌కు బయలుదేరుతారు. అయన ఆగస్టు 23 ఉదయం కీవ్ చేరుకుంటారు. అక్కడ అధ్యక్షుడు జెలెన్స్కీని కలుసుకుంటారు. అదే రైలులో పోలాండ్ కి తిరిగి వస్తారు. ఈ సమయంలో, ప్రధాని మోదీ సుమారు 7 గంటల పాటు ఉక్రెయిన్‌లో ఉంటారు.