Page Loader
Ryan Wesley Routh: గోల్ఫ్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?
డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ క్లబ్ హత్యాయత్నంతో సంబంధం ఉన్న ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?

Ryan Wesley Routh: గోల్ఫ్ క్లబ్ లో డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం.. ర్యాన్ వెస్లీ రౌత్ ఎవరు?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2024
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా (USA)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఫ్లోరిడా రాష్ట్రంలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ఉన్న ట్రంప్‌ గోల్ఫ్‌ కోర్టులో, ఆయన గోల్ఫ్ ఆడుతున్న సమయంలో, ఒక అనుమానాస్పద వ్యక్తి తుపాకీతో సంచరించాడు. దీంతో ఆ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జరిగింది, ఆ తర్వాత సీక్రెట్‌ సర్వీస్‌ అధికారులు ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

వివరాలు 

ఎవరీ ర్యాన్ వెస్లీ రౌత్‌? 

నార్త్ కరోలినాకు చెందిన రౌత్‌ గతంలో కన్‌స్ట్రక్షన్‌ పనులు చేసేవాడు. అతడికి ఎలాంటి మిలిటరీ అనుభవం లేదని న్యూయార్క్ టైమ్స్‌ తెలిపింది. రౌత్‌కు గతంలో చాలాసార్లు సాయుధ పోరాటంలో పాల్గొనాలనే బలమైన కోరికలు ఉండేవట. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. "ఫైట్ అండ్ డై" అంటూ పోస్టులు పెట్టినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే, రౌత్‌ మంచి వ్యక్తి అని అతడి కుమారుడు ఓరన్ పేర్కొన్నాడు. "అతడు గొప్ప తండ్రి, గొప్ప వ్యక్తి. అతడి నిజాయితీ బయటపడుతుందని నమ్ముతున్నా" అని కుమారుడు తెలిపాడు.

వివరాలు 

కీవ్‌ గురించి అమెరికా పాలసీపై అసంతృప్తి

ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన ర్యాన్‌ వెస్లీ రౌత్‌ గత చరిత్ర అనేక అనుమానాస్పద అంశాలతో నిండి ఉంది. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో,అతడు ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై యుద్ధంలో పాల్గొన్నట్లు తెలిపాడు. కీవ్‌ గురించి అమెరికా పాలసీపై అతడు అసంతృప్తిని వ్యక్తం చేశాడు.2022లో న్యూస్‌వీక్‌ (రొమేనియా) పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో,తాను 'ది ఇంటర్నేషనల్‌ లీజియన్‌ డిఫెన్సెస్‌ ఆఫ్‌ ఉక్రెయిన్‌' (ఒక రకమైన ఉక్రెయిన్‌ ప్రత్యేక దళం)లో వాలంటీర్లను రిక్రూట్‌ చేస్తున్నట్లు తెలిపాడు. "మంచి,చెడుకు మధ్య జరిగే పోరాటం ఇది.కథకు ఇది తక్కువ కాదు"అని వ్యాఖ్యానించాడు. అతడు డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతు ఇచ్చాడు.ఆ పార్టీకి విరాళాలు అందించాడు. హవాయిలో అతడి ఇంటి దగ్గర ఉన్న పికప్‌ ట్రక్కుపై బైడన్‌-హారిస్‌ స్టిక్కర్‌ కూడా ఉంది.

వివరాలు 

ప్రచారంపై నిఘా 

రిమార్కింగ్ చేసిన సోషల్‌ మీడియా ఖాతాల్లో, ర్యాన్‌ ఉక్రెయిన్‌ తరఫున యుద్ధంలో పాల్గొన్నట్లు పేర్కొన్నాడు. 2025 మార్చి 25న న్యూయార్క్‌ టైమ్స్‌తో మాట్లాడుతూ, తాలిబన్ల కారణంగా అఫ్గానిస్థాన్‌ నుంచి పారిపోయిన సైనికులను ఉక్రెయిన్‌ తరఫున నియమించినట్లు తెలిపాడు. 2022 నుంచి ఉక్రెయిన్‌లో ఉన్నట్లు పేర్కొన్నాడు. ఉక్రెయిన్‌లోని ఇంటర్నేషనల్‌ వాలంటీర్‌ సెంటర్‌కి అతనే అధిపతినని సెమాఫోర్‌ పత్రికకు తెలిపాడు. 2002లో మారుణాయుధాలు కలిగి ఉన్నట్లు ర్యాన్‌పై నేరం నిరూపించబడింది. అతడు చాలా రోజుల పాటు పరారీలో ఉన్నాడు. 2008లో 32 వేల డాలర్ల పన్ను వివాదంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

వివరాలు 

కస్టడీలో కూల్‌గా 

ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన తర్వాత, ర్యాన్‌ అరెస్టయ్యాక కస్టడీలో కూల్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అతడు తన అరెస్టు కారణం గురించి ప్రశ్నించలేదు. అధికారులు అతడికి ఏమి జరిగిందో స్పష్టంగా తెలుసునని తెలిపారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ దర్యాప్తు ప్రారంభించింది. సోషల్‌ మీడియా ఖాతాలపై వేటు ర్యాన్‌ సోషల్‌ మీడియా ఖాతాలను సస్పెండ్‌ చేయాలని ఎక్స్‌, ఫేస్‌బుక్‌ (మెటా) నిర్ణయించాయి. మెటా అతడి ఫేస్‌పేజ్‌ని పూర్తిగా తొలగించింది. ర్యాన్‌ ఎక్స్‌లో అనుమానాస్పద పోస్టులు చేశారు. ''నీవు మిగిలిన వారి కంటే భిన్నంగా ఉంటావని 2016లో నీకు ఓటు వేశాం ట్రంప్‌. కానీ,నీ తీరుతో మేం తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం. అత్యంత చెత్త అధ్యక్షుడివి. నీవు ఓడిపోతే బాగుంటుంది'' అని 2020లో పోస్టు చేశాడు. "