
#NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థికంగా ఎంత మద్దతు అందించారో అందరికీ తెలిసిన విషయమే .
అయితే గెలిచిన తర్వాత మస్క్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడుగా మారి, డోజీ ద్వారా ఖర్చులు తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు.
కానీ, ప్రస్తుతం ట్రంప్ ప్రవేశపెట్టిన బిగ్ బ్యూటిఫుల్ టాక్స్ బిల్ వారి స్నేహాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
ట్రంప్ ట్యాక్స్ తగ్గింపు బిల్లును పక్కన పెట్టకుండా సపోర్ట్ చేస్తున్నప్పటికీ, మస్క్ దానిపై బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.
అయితే, టెస్లా చీఫ్ తన నిర్ణయాన్ని వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడి స్పందిస్తూ ఇలాంటి వారిని నేను అస్సలు పట్టించుకోనని సమాధానం ఇచ్చారు.
వివరాలు
68 శాతం అధిక ట్యాక్సులు
తాను తెస్తున్న బిల్లు ద్వారా ఖర్చులు 1.6ట్రిలియన్ డాలర్లు తగ్గుతాయని,పన్నుల తగ్గింపులు కూడా ఉండబోతున్నాయని వెల్లడించారు.
కానీ, బిల్లు పాస్ కాకుండా నిలిపివేస్తే, ప్రస్తుతం ఉన్న దానికంటే 68శాతం ఎక్కువ పన్నులు విధిస్తానని ట్రంప్ బెదిరించారు.
ఇక మరోవైపు, ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ ఖాతాలో "తాను లేకుంటే డొనాల్డ్ ట్రంప్ ఖచ్చితంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతారు" అని పోస్ట్ చేసి తీవ్ర దుమారం రేపారు.
దీనిపై ట్రంప్ తీవ్ర నిరాశకు గురి అయ్యారు. "మా ఇద్దరికీ మంచి స్నేహం ఉండేది,కానీ ఇక అది కొనసాగదు" అని వెల్లడించారు.
బిల్ తయారీ ప్రక్రియలో ఏమి జరుగుతుందో మస్క్‌కి బాగా తెలుసన్నారు కానీ, ఇప్పుడీ విధంగా అతడు ఎందుకు మారిపోయారో అర్థం కాకపోతున్నట్టు చెప్పారు.
వివరాలు
ఎప్‌స్టిన్ ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు
కాగా, అమెరికాలో అత్యంత గోప్యంగా ఉంచబడిన ఎప్‌స్టిన్ ఫైళ్లలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉందని ఎలాన్ మస్క్ పెద్ద బాంబు పేల్చారు.
నిజాలు భవిష్యత్తులో బయటకు వస్తాయని ట్వీట్ చేశారు. అందుకే ట్రంప్ ఈ పత్రాలను బయటికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ట్రంప్ గతంలో ఎప్‌స్టిన్‌తో పరిచయం ఉందని ఒప్పుకున్నప్పటికీ, తనకు ఏ నేర కార్యకలాపాలలో ప్రమేయం లేదని చెబుతున్నట్టు మస్క్ గుర్తు చేశారు.