Page Loader
Deadly Bioweapon: చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్‌.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్‌ చాంగ్‌ 
చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్‌.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్‌ చాంగ్‌

Deadly Bioweapon: చైనాలోనే,మరో భయంకరమైన ఫంగస్‌.. హెచ్చరించిన చైనా నిపుణుడు గోర్డాన్‌ చాంగ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా వ్యవసాయ ఉగ్రవాదానికి పాల్పడుతోందని గత వారం అమెరికా ఎఫ్‌బీఐ డైరెక్టర్ కశ్యప్ పటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. అమెరికాలో చైనా కు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు అరెస్టు కావడం ద్వారా ఈ కుట్ర బయటపడిందని ఆయన పేర్కొన్నారు. అయితే చైనాకు సంబంధించి సమస్య ఇక్కడితో ముగియదని, దాని ఉగ్రత వ్యూహాలు ఇంకా తీవ్రంగా మారొచ్చని, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ న్యాయవాది మరియు రాజకీయ విశ్లేషకుడు గోర్డాన్ చాంగ్ హెచ్చరించారు. ఒక అమెరికా టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోర్డాన్ చాంగ్ మాట్లాడుతూ, చైనా నుంచి వస్తున్న ప్రమాద సంకేతాలను అమెరికా నిర్లక్ష్యంగా తీసుకోకూడదని స్పష్టంగా తెలిపారు.

వివరాలు 

హెడ్ బ్లైట్ అనే దుష్పరిణామాన్ని కలిగించే ఫంగల్ వ్యాధి

ఈ వ్యాఖ్యలతో చైనా ఫంగస్‌ వల్ల కలిగే ప్రమాదాలపై చర్చ మళ్లీ ముమ్మరమైంది. చైనా వలన ఉత్పత్తి అయ్యే ఫంగస్‌లు ఎంత భయానకమైనవో వివరించుతూ, అమెరికా కొద్దిగా కూడా అప్రమత్తంగా లేకపోతే, కరోనా మహమ్మరిని మించి తీవ్రత కలిగిన సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తుందని గోర్డన్ చాంగ్ హెచ్చరించారు. ప్రస్తుతం వివాదంలో ఉన్న ఫంగస్ పేరు ఫ్యూసేరియమ్ గ్రామినీరమ్. ఇది గోధుమ,బార్లీ, వరి, మొక్కజొన్న వంటి ప్రధాన ధాన్య పంటలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది హెడ్ బ్లైట్ అనే దుష్పరిణామాన్ని కలిగించే ఫంగల్ వ్యాధికి కారణమవుతుంది. అమెరికా న్యాయ శాఖ ప్రకారం,ఈ ఫంగస్‌ను సమర్థవంతమైన వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా పరిగణిస్తున్నారు. ఇది ప్రతియేటా బిలియన్ల డాలర్ల వ్యవసాయ నష్టాలకు కారణమవుతోందని పేర్కొన్నారు.

వివరాలు 

చైనాలో ఈ ఫంగస్‌పై పరిశోధనలు

ఈ ఫంగస్‌ వల్ల మనుషులు, జంతువులు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వాంతులు, కాలేయానికి హాని, రీప్రొడక్టివ్ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. ఇటీవల అరెస్టైన చైనా జాతీయులు జున్యోంగ్ లియు (34) అతని భాగస్వామి యుంకింగ్ జియాన్ (33) అక్రమంగా అమెరికాకు ఈ ప్రమాదకర ఫంగస్‌ను రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరి గత చరిత్రను పరిశీలించగా, చైనాలో వారు ఈ ఫంగస్‌పై పరిశోధనలు నిర్వహించినట్లు తెలిసింది. అలాగే బయోసెక్యూరిటీ ఉల్లంఘనల గురించి గతంలోనే హెచ్చరికలు వచ్చినట్లు పరిశోధకులు వెల్లడించారు.

వివరాలు 

అమెరికా తక్షణమే చైనాతో ఉన్న సంబంధాలను తెంచుకోవాలి 

ఈ నేపథ్యంలో గోర్డాన్ చాంగ్ తీవ్రంగా హెచ్చరిస్తూ, చైనా వ్యవసాయ ఉగ్రవాద చర్యలను అడ్డుకోవాలంటే, అమెరికా తక్షణమే చైనాతో ఉన్న సంబంధాలను తెంచుకోవాలని పిలుపునిచ్చారు. లేకపోతే, భవిష్యత్‌లో మరింత తీవ్రమైన పరిణామాలు అమెరికాను ఎదుర్కొనేలా చేస్తాయని ఆయన హెచ్చరించారు.