
Yahya Sinwar: హమాస్ కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వర్
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ కొత్త పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వర్ ఎంపికయ్యారు.
ఇరాన్‌లో ఇస్మాయిల్ హనియా హత్యకు గురి కావడంతో యాహ్యా సిన్వర్‌ను కొత్త చీఫ్‌గా నియమిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది.
హమాస్ కొత్త చీఫ్ ఎంపిక చేసిన కొద్ది నిమిషాల్లోనే హమాస్ సాయుధ బలగం 'ఎజ్జెడైన్ అల్ కస్సమ్' బ్రిగేడ్స్ ఇజ్రాయెల్ వైపు రాకెట్లను ప్రయోగించింది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై దాడి చేయడంలో సిన్వర్ సూత్రధారి అని తెలుస్తోంది.
Details
ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో సిన్వార్
2017 నుండి గాజా స్ట్రిప్‌లో గ్రూప్ లీడర్‌గా సిన్వార్ పనిచేశారు. ప్రస్తుతం ఆయన గాజాలోనే నివసిస్తున్నారు.
ప్రస్తుతం ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో సిన్వార్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2023 అక్టోబర్ 7న జరిగిన దాడుల్లో అతను సూత్రధారి అని ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీలు పేర్కన్నాయి.
ఈ ఘటనలో 1,200 మందిగా పైగా మరణించిన విషయం తెలిసిందే.
1962లో గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో సిన్వార్ జన్మించాడు.
1980లో సిన్వార్ మజ్ద్ అనే హమాస్ భద్రతా సేవను స్థాపించాడు.