ISIS:యాజిదీ పిల్లలను చంపి వండి తమను తినేలా చేసింది..: ఐసిస్ బందీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఇటీవల లెబనాన్‌లో ఐసిస్ (ISIS) చేతిలో బందీగా ఉన్న ఫౌజియా అమీన్ సిడో అనే మహిళను రక్షించి, ఆమెను ఆమె కుటుంబానికి అప్పగించింది.
పదేళ్లపాటు ఐసిస్ చేతిలో బాధలు అనుభవించిన ఆమె, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, తాను ఎదుర్కొన్న భయానక సంఘటనలను వెల్లడించారు.
2014లో ఐసిస్ 200 మంది మహిళలు,పిల్లలను బానిసలుగా చేసుకున్నప్పుడు,ఫౌజియా కూడా వారిలో ఒకరని తెలిపారు.
ఆమెకు అప్పటికి తొమ్మిదేళ్ళ వయసు. ఫౌజియా చెబుతూ,"మమ్మల్ని మూడు రోజులపాటు ఆహారం లేకుండా ఉంచి,తరువాత మాకు దుర్వాసన కలిగిన అన్నం, మాంసం ఇచ్చారు. ఆ మాంసం యజిదీ శిశువులదని తెలిసి, మా హృదయాలు విరిగిపోయాయి. ఉగ్రవాదులు చిన్నారులను చంపి వండి పెట్టేవారు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాలు
జిహాదీ ఉగ్రవాదులకు అమ్మేసిన ఐసిస్
తన పేరును 'సబయా'గా మార్చి, జిహాదీ ఉగ్రవాదులకు అమ్మేశారని, ఇప్పుడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆమె వివరించారు.
ఇజ్రాయెల్ రక్షించినా, తన పిల్లలు ఇప్పటికీ ఐసిస్ చేతిలో ఉన్నారని, వారు అరబ్ ముస్లింలుగా పెరుగుతున్నారని ఫౌజియా బాధతో తెలిపారు.