Loading...
Bab el-Mandeb: బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత.. హూతీల కీలక ప్రకటన
బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత.. హూతీల కీలక ప్రకటన

Bab el-Mandeb: బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధి మూసివేత.. హూతీల కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధి మూసివేత ప్రభావంతో ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్ర సముద్రానికి ప్రవేశ ద్వారంగా భావించే బాబ్‌ ఎల్‌-మాండెబ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సోమవారం ప్రకటించారు. సౌదీ అరేబియాకు వెళ్లే నౌకల రాకపోకలను అడ్డుకునే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రపంచ అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రతి ఏడాది సుమారు 12 శాతం సరుకు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో తాజా నిర్ణయం ప్రపంచ షిప్పింగ్‌, వాణిజ్య రంగాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. తాము విధించిన నిషేధాజ్ఞలు తక్షణమే అమల్లోకి వస్తాయని హూతీలు స్పష్టం చేశారు.

వివరాలు 

టెహ్రాన్‌పై పదో రోజు వైమానిక దాడులు

ఇరాన్‌పై అమెరికా వరుసగా పదో రోజూ వైమానిక దాడులు కొనసాగించింది.

టెహ్రాన్‌లోని సైనిక కమాండ్‌ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు,తీరప్రాంత నిఘా కేంద్రాలు, సముద్ర రక్షణ సామర్థ్యాలు,క్షిపణి,డ్రోన్‌ ప్రయోగ కేంద్రాలు,కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ సోమవారం వెల్లడించింది.

ఈ దాడుల్లో తబ్రిజ్‌ నగరంలో ఒక వ్యక్తి మృతిచెందినట్లు ఇరాన్‌ ప్రభుత్వ వార్తాసంస్థ 'ఐఆర్‌ఎన్‌ఏ' తెలిపింది.

వివరాలు 

టెహ్రాన్‌పై పదో రోజు వైమానిక దాడులు

మరోవైపు, ఇరాక్‌లో కూల్చివేసిన ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ను నియంత్రిత పద్ధతిలో శనివారం పేల్చివేస్తున్న సమయంలో జరిగిన ఘటనలో అమెరికా సైన్యానికి చెందిన ఒక సైనికుడు మృతిచెందినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

అయితే ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఇరాన్‌తో చర్చలకు ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు.

తమకు కొన్ని ప్రతిపాదనలు అందాయని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయీల్‌ బఘాయీ వెల్లడించారు.

ADVERTISEMENT