English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Zelenskyy: యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు వచ్చేందుకు పుతిన్‌ భయపడుతున్నారు: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Zelenskyy: యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు వచ్చేందుకు పుతిన్‌ భయపడుతున్నారు: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ 
    Zelenskyy: యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు వచ్చేందుకు పుతిన్‌ భయపడుతున్నారు

    Zelenskyy: యుద్ధాన్ని ముగించి శాంతి చర్చలకు వచ్చేందుకు పుతిన్‌ భయపడుతున్నారు: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్కీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 29, 2025
    08:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మూడేళ్లుగా ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దీనికి ముగింపు పలకడం గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ చర్చలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.

    అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.

    ఈ పరిణామంపై స్పందించిన జెలెన్‌స్కీ, "పుతిన్ బలమైన నాయకులకూ, చర్చలకూ భయపడతారని మరోసారి స్పష్టమైంది. యుద్ధాన్ని కొనసాగించేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి వ్యూహం, ప్రతి కదలిక యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేలా ఉంది. 2014లోనే రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించింది. 2022లో అది మరింత విస్తరించింది. ఇప్పుడు శాంతి స్థాపనకు అవకాశమున్నా, పుతిన్ ఆ దిశగా ముందుకు రావడం లేదు" అని తెలిపారు.

    వివరాలు 

    జెలెన్‌స్కీతో చర్చలు జరగవు - పుతిన్ 

    అంతేకాదు, "పుతిన్‌ వద్ద ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీయగల శక్తి ఉన్నా, బలమైన నాయకుల ఒత్తిడిని ఎదుర్కొనే స్థైర్యం లేదు. అందుకే మనం ఐక్యంగా, వ్యవహరించాలి. శాంతిని కోరేవారంతా కలిసి రష్యాపై ఒత్తిడి పెంచాలి. అప్పుడు మాత్రమే నిజమైన శాంతిని సాధించగలం" అంటూ జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

    దీనికి ప్రత్యుత్తరంగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు సాధ్యమేనని పేర్కొన్నారు. అయితే, జెలెన్‌స్కీతో తాము చర్చలకు రావడం అసాధ్యమని స్పష్టం చేశారు.

    "ఉక్రెయిన్‌తో చర్చలు జరిపి రాజీకి రావాలనుకుంటున్నాం.కానీ,ప్రస్తుత అధ్యక్షుడితో అలా జరగదు. మా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ముందుకు సాగుతాం. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌కు సహాయాన్ని నిలిపివేస్తే, ఈ యుద్ధం రెండునెలల్లోనే ముగుస్తుంది" అని పుతిన్ వ్యాఖ్యానించారు.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    ట్రంప్ హామీ: యుద్ధానికి ముగింపు 

    అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగిస్తానని ప్రకటించారు.

    "ఈ యుద్ధం అసలు ప్రారంభమవ్వకూడదనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే, ఈ సంక్షోభమే రాదు. అయితే, ఇప్పుడు దీనికి త్వరలోనే ముగింపు పలుకుతాను. శాంతి చర్చలకు ఇరుదేశాల నాయకులు ముందుకు రావాలి. రష్యా చర్చలకు అంగీకరించకపోతే, వారికి గట్టి ఆంక్షలు విధిస్తాను" అని ట్రంప్ హెచ్చరించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జెలెన్‌స్కీ
    వ్లాదిమిర్ పుతిన్

    తాజా

    operation sindoor: పాక్ తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేస్తోంది : పీఐబీ ఆపరేషన్‌ సిందూర్‌
    LIC: ఎల్‌ఐసీ సరికొత్త సదుపాయం.. వాట్సప్‌ బాట్‌లో ప్రీమియం చెల్లింపు! లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
    Pakistan: పాక్‌లో పెట్రోల్‌ కొరత.. 48 గంటలు బంక్‌ల మూసివేత పాకిస్థాన్
    Balochistan: పాకిస్థాన్‌కు నెత్తిన మరో బాంబు.. స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్థాన్! పాకిస్థాన్

    జెలెన్‌స్కీ

    ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకి ఉంది: ఆమెరికా వ్లాదిమిర్ పుతిన్
    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్
    మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్‌స్కీ అభ్యర్థన నరేంద్ర మోదీ
    రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రిషి సునక్

    వ్లాదిమిర్ పుతిన్

    కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత ప్రిగోజిన్ విమాన ప్రమాదంపై స్పందించిన రష్యా రష్యా
    మోదీకి పుతిన్ ఫోన్.. G20 సమ్మిట్‌కు రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ నరేంద్ర మోదీ
    రష్యా సంచలన నిర్ణయం.. చైనాలో పర్యటించేందుకు పుతిన్ గ్రీన్ సిగ్నల్ రష్యా
    పుతిన్‌ను అరెస్టు చేసే ఉద్దేశం మాకు లేదు: బ్రెజిల్ అధ్యక్షుడు  తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025