LOADING...
Donald Trump: ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్‌.. స్పందించిన జెలెన్‌స్కీ 
ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్‌.. స్పందించిన జెలెన్‌స్కీ

Donald Trump: ఉక్రెయిన్‌కు కృతజ్ఞత లేదన్న ట్రంప్‌.. స్పందించిన జెలెన్‌స్కీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీపై శాంతి ఒప్పందం విషయంపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ, ఉక్రెయిన్ ప్రభుత్వం అమెరికా సహాయానికి కృతజ్ఞత చూపడం లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, యూరప్ దేశాలు మాత్రం రష్యా చమురు దిగుమతులు కొనసాగిస్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. తాను అధికారంలో ఉన్నట్లయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అసలు మొదలయ్యేదే కాదని ట్రంప్ స్పష్టం చేశారు.

వివరాలు 

అమెరికాకు కృతజ్ఞతలు

ట్రంప్ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న వేళ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా తన ప్రతిస్పందనను తెలిపారు. మొదట ఆయన అమెరికాకు కృతజ్ఞతలు తెలుపుతూ, జావెలిన్ క్షిపణులు అందించడం ద్వారా లక్షలాది ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు కాపాడాయని గుర్తుచేశారు. తమ దేశం శాంతి, దౌత్యం, అంతర్జాతీయ సహకార మార్గానికే ప్రాధాన్యత ఇస్తుందని, యుద్ధం ఎప్పుడూ తమ ఎంపిక కాదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు అందించిన మద్దతు, సలహాలు, సమాచారం తమకు ఎంతో తోడ్పడ్డాయని పేర్కొన్నారు. శాశ్వతమైన శాంతి నెలకొనాలని తమ ఆకాంక్ష అని జెలెన్‌స్కీ అన్నారు.