Global NCAP:గ్లోబల్ NCAP ద్వారా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్లుఇవే!
భారత్ ఆటో మొబైల్ మార్కెట్లోకి 2023లో అనేక కార్లు లాంచ్ అయ్యాయి. కారు కొనుగోలు చేసే ముందు చాలా రకాల అంశాలు పరిశీలించాలి. ఫర్ఫామెన్స్, మైలేజీ చెక్ చేయడం ఎంత ముఖ్యమో అవి ఆఫర్ చేసే సేఫ్టీ ఫీచర్లను కూడా తెలుసుకోవడం అంతే ముఖ్యం. క్రాష్ టెస్ట్ రేటింగ్ కోసం భారత్ NCAPను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ NCAP ద్వారా తొలిసారిగా టాటా సఫారీ ఫేస్ లిస్ట్, హారియర్ ఫేస్ లిప్ట్ కార్లు క్రాష్ టెస్టింగ్‌ను ఎదుర్కొన్నాయి. ఈ రెండు కార్లు కూడా భద్రతలో 5స్టార్ రేటింగ్‌ను పొందాయి. అదే విధంగా BNCAP నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన తొలి కార్లుగా సఫారీ, హారియర్‌లు నిలిచాయి.
టాటా సఫారీ, హారియర్ లో సేఫ్టీ ఫీచర్లు
టాటా సఫారీ, హారియర్ ఈ రెండు కార్లు భారత్ NCAP ద్వారానే కాకుండా గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో భద్రతలో 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ సేఫ్టీ కంట్రోల్, ISOFIZ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్, సీట్ బెల్డ్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వోక్స్ వ్యాగన్ వర్టన్ ఈ సెడాన్ కారు గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్టును ఎదుర్కొంది. అత్యున్నత ప్రోటోకాల్స్ ను కలిగిన GNCAP పరీక్షల్లో ఈ కారు 5 స్టార్ సేప్టీ రేటింగ్‌ను పొందింది. ఈ కారు రూ.11.48 లక్షల నుంచి రూ.19.29 లక్షల(ఎక్స్ షోరూం) ధర మధ్య లభిస్తుంది.
5 స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకున్న స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నా
స్కోడా స్లావియా స్కోడా స్లావియా GNCAP క్రాష్ టెస్ట్‌లో స్లావియా 5 స్టార్ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు, ఓవర్ స్పీడ్ వార్నింగ్, ఆటోమేటిక్ లాకింగ్, రియల్ రివ్యూ కెమరా, చైల్డ్ లాక్ ISOFIX చైల్డ్ యాంకర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. హ్యుందాయ్ వెర్నా గ్లోబల్ NCAP ద్వారా హ్యుందాయ్ వెర్నా క్రాష్ టెస్టింగ్‌ను ఎదుర్కొంది. ఈ సెడాన్ మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారు చేశారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), సీట్ బెల్ట్ రిమైండర్ సహా మరిన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి.