Page Loader
కొత్త లుక్‌లో 2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు.. ధర ఎంతంటే? 
కొత్త లుక్‌లో 2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు.. ధర ఎంతంటే?

కొత్త లుక్‌లో 2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు.. ధర ఎంతంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 29, 2023
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ మార్కెట్లో ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారుకి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం 2024 పోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు కొత్త లుక్‌లో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 1966లో ఫోర్డ్ బ్రోంకో ను తొలిసారిగా మార్కెట్లో ప్రవేశపెట్టినా ఇప్పటి వరకు ఏ మాత్రం డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం 25 సంవత్సరాల తర్వాత US-ఆధారిత కార్‌మేకర్ లైనప్‌కి ఈస్పోర్ట్ కారు తిరిగి వచ్చింది. ఈ స్పోర్ట్ కారు కోసం కంపెనీ $2,500 అదనపు ఖర్చుతో ఫ్రీ వీలింగ్ ఎడిషన్‌తో ప్రత్యేకంగా రూపొందించారు. 2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ లో మస్కులర్ హుడ్, ప్రొజెక్టర్ LED హెడ్‌ల్యాంప్‌లు, 'బ్రోంకో' అక్షరాలతో కూడిన క్రోమ్డ్ గ్రిల్, స్కిడ్ ప్లేట్‌లతో కూడిన బంపర్‌లు, రూఫ్ రెయిల్‌లు, రేక్డ్ విండ్‌స్క్రీన్ ఉండనున్నాయి.

Details

2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారులో అదనపు ఫీచర్లు

2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ బాక్సీ సిల్హౌట్‌ను కలిగి ఉంది. ఇది 17-అంగుళాల డిజైనర్ చక్రాలను కలిగి ఉండటంతో పాటు LED టెయిల్‌ల్యాంప్‌లు వెనుక భాగంలో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఐదు-సీట్ల క్యాబిన్‌, ఎరుపు రంగు ట్రిమ్‌లతో మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్ డిజైన్‌ను కలిగి ఉంది. మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, 12.0-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రీ-స్టాండింగ్ 8.0-అంగుళాల ఫోర్డ్ సింక్ 3 ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్ బ్యాగ్స్ ఉండనున్నాయి. US మార్కెట్‌లో 2024 ఫోర్డ్ బ్రోంకో స్పోర్ట్ కారు ధర రూ. $35,325 (సుమారు రూ. 29.03 లక్షలు) డాలర్లు ఉంది.