Ampere: టెస్టింగ్ దశలో అంపియార్ NXG ఇ-స్కూటర్.. డిజైన్ ఎలా ఉందంటే?
ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో యాంపియర్ ఈ స్కూటర్ ఇండియాలోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొచ్చింది. అయితే మొట్టమెదటి సారిగా వినియోగదారుల సౌకర్యార్థం ఆ సంస్థ యాంపియర్ NXG ఈ స్కూటర్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ స్కూటర్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్కూటర్ డిజైన్ పై వినియోగదారులు ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. యాంపియర్ NXGలో ఫుట్‌పెగ్‌లు, ఆల్‌అరౌండ్ LED లైటింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేకును ప్రత్యేకంగా అమర్చారు. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120కిమీ ప్రయాణం చేయగలదని ఆ సంస్థ స్పష్టం చేసింది.
ఐదు సెకన్లలో 0 నుండి 40 కిలోమీటర్ల వేగం
NXG లిథియం-అయాన్ బ్యాటరీని ఉపయోగిస్తుందా లేదా ప్రిమస్ వంటి లిథియం ఫెర్రస్ ఫాస్ఫేట్ యూనిట్‌ని ఉపయోగిస్తుందా అనేది స్పష్టంగా సంస్థ వెల్లడించలేదు. అయితే ఈ వాహనం ప్రస్తుత ధర రూ.1.46 లక్షలు ఉండే అవకాశం ఉంది. కేవలం ఐదు సెకన్లలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూ మోటార్ ను అమర్చారు.