Page Loader
Car Subscription : చందాతో 'కారు' షికారు.. సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ బెనిఫిట్స్ ఇవే
కారు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌

Car Subscription : చందాతో 'కారు' షికారు.. సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ బెనిఫిట్స్ ఇవే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 24, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

చందాతో కారు షికారు చేసే సంస్కృతి పెరుగుతోంది.కారు సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ పోకడ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఈ విధానంలో నెల నెలా డబ్బులు చెల్లించి నచ్చిన కారును నిర్ణీత కాలం వరకు సొంతం చేసుకోవచ్చు. అయితే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కారు కొనడం ఖర్చుతో కూడుకున్న అంశం. ఒకవేళ సెకండ్‌ హ్యాండ్‌ కారు కొంటే మెంటెయినెన్స్ ఖర్చులు తడిసి మోపడు అవుతుంటాయి. కొత్త కారు కోసం రుణం తీసుకుంటే దానికి అసలూ వడ్డీ చెల్లించాలి. దానికి ఇంధనం పోయడం సహా ఏటా బీమా పాలసీ చేయించాలి. ఈ సందర్భంలో కొత్త కారు కొనడం మరో ఆప్షన్‌. దీంతో ఖర్చు బాగా ఉంటుంది. ఈ క్రమంలోనే సబ్‌స్క్రిప్షన్‌ కొత్తగా విస్తరిస్తోంది. రిపేర్‌ వస్తే చేయించాలి.

details

కాల వ్యవధి వరకు కారు ఓనర్ మీరే

కారును సబ్‌స్క్రిప్షన్‌కు తీసుకుంటే నెలవారీ చందా చెల్లించి తగినంత పెట్రోల్‌, టోల్‌ ఛార్జీల భారం భరిస్తే సరిపోతుంది. సబ్‌స్క్రిప్షన్‌ విధానంలో నచ్చిన కారును ఎంపిక చేసుకుని నెలవారీ చందా చెల్లిస్తే చేతిలోకి కారు సమకూరుతుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసుకున్న కాల వ్యవధి వరకు కారు మీ వద్దే ఉంటుంది. ఒకరకంగా అప్పటి వరకు ఆ కారుకు మీరే ఓనర్. మారుతీ సుజుకీ, హ్యుందాయ్‌, మహీంద్రా, ఎంజీ, నిస్సాన్‌, టయోటా వంటి కంపెనీలు సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాయి. కనిష్టంగా 12 నెలల నుంచి గరిష్టంగా 48 నెలల కాలానికి కోరుకున్న కారు, కావాల్సిన మోడల్స్ ను ఎంచుకోవచ్చు.

DETAILS

నచ్చిన కారును నచ్చినంత కాలానికి సబ్‌స్క్రిప్షన్‌ 

ఏమేం తీసుకెళ్లాలంటే : డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు రుణం తీసుకునే సమయంలో అడిగే పత్రాలు, పన్నులు, నిర్వహణ ఛార్జీలు,సేవా రుసుం,రోడ్‌ సైడ్‌ అసిస్టెన్స్‌, రిజిస్ట్రేషన్‌, వారంటీ, రిపేర్లు ఇలా అన్నీ ప్యాకేజీలో ఉండనున్నాయి. కారు తీసుకున్న కంపెనీకే నేరుగా చెల్లింపులు చేస్తే సరిపోతుంది.మీకు నచ్చిన కారును నచ్చినంత కాలానికి సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునే వీలుంది. లాభాలు : కారుకు సర్వీసింగ్‌, బీమా తీసుకోవడం వంటి పనులేం చేయనవసరం లేదు.మరింత కాలం కారును కొనసాగించాలంటే సబ్‌స్క్రిప్షన్‌ గడువును పొడిగించుకుంటే సరి. ఇవి పరిగణలోకి తీసుకోవాలి : కారు కొనుగోలు రుణానికి చెల్లించే అసలు, వడ్డీ కంటే సబ్‌స్క్రిప్షన్‌కే ఎక్కువ చెల్లించాల్సి వస్తే సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ ఎంచుకున్న దాని కంటే ఎక్కువ రీడింగ్ తిరిగితే అదనంగా చెల్లించాలి.