సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్.. త్వరలోనే రెండు కొత్త ఈ స్కూటర్లు!
బెంగళూరు EV స్టార్టప్ కంపెనీ సింపుల్ ఎనర్జీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. త్వరలోనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను రూపొందించనుంది. వచ్చే త్రైమాసికంలో ఈ రెండు స్కూటర్లను లాంచ్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సింపుల్ 1 కన్నా తక్కువ ధరలో ఉంటాయని ప్రకటించింది. సింపుల్ 1 ఎక్స్ షో రూం ధర రూ. 1.45 లక్షలు, రూ.1.5 లక్షలు మధ్యలో ఉండనుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెట్లో తమ పోర్ట్ పోలియోను పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. ఈ వాహనాల్లో బ్యాటరీ ప్యాక్ చిన్నగా ఉండనుంది. ఫలితంగా రేంజ్ కూడా తగ్గే అవకాశం ఉంది. తక్కువ ధరతో ముందుకొస్తుండటంతో ఈసింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఫీచర్స్ పెద్దగా ఉండకపోవచ్చని సమాచారం.
2.77 సెకన్లలోనే 40 కిలోమీటర్ల స్పీడ్
లాంచ్ తర్వాత ఈ వెహికల్స్ టీవీఎస్ ఐక్యూబ్, అథెర్ 450 ఎక్స్, ఓలా ఎస్ 1 ఎయిర్‌కు గట్టి పోటిస్తుందని మార్కెట్లో అంచనాలున్నాయి. సింపుల్ 1లోని పీక్ పవర్ ఔట్ పుట్ 8.5 కేడబ్ల్యూగా ఉంది. 72 ఎన్ఎం పీక్ టార్క్ ను జనరేట్ చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 105 కేఎంపీహెచ్, 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను కేవలం 2.77 సెకన్లలోనే అందుకుంటుంది. ఇందులోని 5 కేడబ్ల్యూహెచ్ తో కూడిన రెండు బ్యాటరీ ప్యాక్స్ ను ఫుల్ ఛార్జ్ చేసేందుకు 5. 54 గంటల సమయం పట్టనుంది. పోర్టెబుల్ బ్యాటరీ ఛార్జింగ్ కు 2 గంటల 7 నిమిషాలు, ఫిక్స్‌డ్ బ్యాటరీకి 3 గంటల 47 నిమిషాల పడుతుంది.