2023 ఫార్ములా 1 సీజన్ కోసం SF-23 రేస్ కారును ప్రదర్శిస్తున్న ఫెరారీ
రాబోయే 2023 ఫార్ములా 1 (F1) సీజన్‌కు ముందు, ఇటాలియన్ వాహన తయారీ సంస్థ ఫెరారీ తన SF-23 రేస్ కారును ప్రకటించింది. గత సంవత్సరం మోడల్ కంటే చిన్న మార్పులు చేసారు. ఇది 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజన్‌తో నడుస్తుంది. 15 సంవత్సరాల గెలవలేని చరిత్రను ఈసారైనా మార్చాలని సంస్థ భావిస్తుంది. గత సంవత్సరం, లోపాలు ఉన్న ఇంజిన్, డ్రైవర్ తప్పిదాలు వంటి కారణాలతో గెలుపు తృటిలో తప్పిపోయింది. 2023లో, ఇటాలియన్ స్టాలియన్ కొత్త ఎనర్జీతో అనేక ప్రణాళికలతో మళ్ళీ ఈ రేస్ లో పాల్గొంటుంది. ఫెరారీ SF-23 ఎనిమిది ఫార్వర్డ్ గేర్‌లతో కనెక్ట్ అయిన 1.6-లీటర్, టర్బోచార్జ్డ్, V6 ఇంజిన్ తో నడుస్తుంది.
ఫెరారీ 2007లో F1 డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది
ఎలక్ట్రిక్ మోటార్లు, లిథియం-అయాన్ బ్యాటరీలతో ఉన్న ఎనర్జీ రికవరీ సిస్టమ్ ద్వారా నడుస్తుంది. ఇది అదనంగా 161hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పుష్-రాడ్ ఫ్రంట్ సస్పెన్షన్, బ్రెంబో వెంటిలేటింగ్ కార్బన్ డిస్క్ బ్రేక్‌లు, హైడ్రాలిక్ కంట్రోల్డ్ రియర్ డిఫరెన్షియల్ కూడా అందుబాటులో ఉన్నాయి. గత సీజన్ F1లో ఫెరారీ ఇంజిన్ అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగిన రేసులో రెండుసార్లు మొరాయించింది ఇప్పుడు, ఫెరారీ దానిని పూర్తిగా సర్దుబాటు చేసింది. ఫెరారీ 2007లో F1 డ్రైవర్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది, ఆ తర్వాత 2008లో కన్స్ట్రక్టర్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అప్పటి నుండి, ఫెరారీకి మళ్ళీ ఈ రేసులో గెలుపు పలకరించలేదు. 2023లో, డ్రైవర్లు కార్లోస్ సైంజ్, చార్లెస్ లెక్లెర్క్, ఫ్రెడ్ వాస్యూర్ తో కలిసి రేసులో పాల్గొనున్నారు.