
Ford: ఫోర్డ్ ఎండీవర్‌తో భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్న ఫోర్డ్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ మోటార్స్ భారత్‌లో వాహనాలను తయారీని తిరిగి ప్రారంభించనున్నట్లు సమాచారం.
ఫోర్బ్స్ ఇండియా ప్రకారం, కంపెనీ చెన్నైలోని తన తయారీ ప్లాంట్‌ను విక్రయించాలని ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు దానిని తిరిగి కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మరైమలై నగర్‌లో ఉన్న ఈ ప్లాంట్ సంవత్సరానికి 2,00,000 వాహనాలు, 3,40,000 ఇంజన్‌లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని ఫోర్బ్స్ నివేదిక పేర్కొంది.
భారత్‌లో ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో భాగంగా ఫోర్డ్ ప్రీమియం SUVలను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.
Details
1996లో విడుదలైన ఫోర్డ్ ఎస్కార్ట్ అనే సెడాన్‌తో భారతదేశంలో కార్యకలాపాలు
కంపెనీ CEO,జిమ్ ఫార్లే ఆధ్వర్యంలో ఫోర్డ్ ట్రక్కులు,SUVలు, వాణిజ్య వాహనాల పనితీరు,కార్ల వంటి ప్రధాన విభాగాల విద్యుదీకరణ,డిజిటల్ పరివర్తనపై దృష్టి సారించిందని ఫోర్బ్స్ ఇండియాకు ఫోర్డ్ ఇండియా మాజీ డైరెక్టర్ వినయ్ పిపర్సానియా చెప్పారు.
గతేడాది అంతర్జాతీయ మార్కెట్ కోసం చెన్నై ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలన్న ప్రణాళికను కంపెనీ విరమించుకుంది.
తాజాగా, ఫోర్డ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా భారత్ కు చెందిన కుమార్ గల్హోత్రా బాధ్యతలు స్వీకరించకా కంపెనీ దేశీయంగా రీఎంట్రీ చేయనున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.
ఫోర్డ్ 1996లో విడుదలైన ఫోర్డ్ ఎస్కార్ట్ అనే సెడాన్‌తో భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది.
2021లో మోడల్‌ను నిలిపివేసినప్పటికీ, ఐకాన్, ఫిగో,ఎకోస్పోర్ట్ వంటి మోడళ్లతో కంపెనీ విజయం సాధించింది.