Page Loader
Osamu Suzuki: సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసామూ సుజుకీ కన్నుమూత
సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసామూ సుజుకీ కన్నుమూత

Osamu Suzuki: సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసామూ సుజుకీ కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2024
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఒసాము సుజుకీ (94) గత 25న లింఫోమా (బ్లడ్‌ క్యాన్సర్‌)తో కన్నుమూశారని కంపెనీ ప్రకటించింది. సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ జపాన్‌లో పరిమితమైన సంస్థగా ప్రారంభమైనప్పటికీ, ఒసాముసుజుకీ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దశాబ్దాల పాటు సుజుకీ ఛైర్మన్‌గా తన సేవలు ఇచ్చిన ఆయన, సంస్థను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

కార్లు, మోటార్‌ సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర

ఒసాము సుజుకీ జనవరి 30, 1930న జపాన్‌లోని గెరోలో జన్మించారు. ఆయన అసలు పేరు ఒసాము మత్సుడా. మొదట స్థానిక బ్యాంకులో లోన్‌ ఆఫీసర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన, 1958లో షోహో సుజుకీని వివాహం చేసుకున్నారు. సుజుకీ కుటుంబానికి వారసులు లేకపోవడంతో, ఆయన వివాహం అనంతరం అయన పేరులో సుజుకీ వచ్చి చేరింది. తరువాత, ఆయన సంస్థకు నాయకత్వం వహించి , కార్లు, మోటార్‌ సైకిళ్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు 

 మారుతీ 800 కార్ దేశీయంగా భారీ చరిత్ర

ఒసామును, జపాన్‌లోని పెద్ద ఆటో మొబైల్‌ సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అతని హయాంలో జనరల్‌ మోటార్‌, ఫోక్స్‌వ్యాగన్‌ వంటి ప్రముఖ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడమే కాకుండా, అమెరికా, యూరప్‌లలో సుజుకీని విస్తరించారు. 1980లలో భారతదేశం కోసం సుజుకీ కొత్త మార్కెట్‌ను తెరచింది, మారుతీ ఉద్యోగ్‌ పేరుతో భారత ప్రభుత్వంతో కలిసి ఆటోమొబైల్‌ జాయింట్‌ వెంచర్‌ను ప్రారంభించింది. ఈ భాగస్వామ్యం తరువాతి కాలంలో మారుతీ సుజుకీగా మారింది, దేశంలోకి ప్రవేశించిన తొలి విదేశీ కంపెనీ కూడా ఇదే. ప్రస్తుతం మారుతీ సుజుకీ దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా వెలుగొందుతోంది. 1980లలో తీసుకొచ్చిన మారుతీ 800 కార్ దేశీయంగా ఒక భారీ చరిత్రను సృష్టించింది.