
Hyundai: జీఎస్‌టీ తగ్గింపు.. హ్యుందాయ్, టాటా కార్ల ధరల్లో భారీ కోత
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్‌టీ రేట్ల తగ్గింపుతో కార్ల కొనుగోలు మరింత సులభం కావడానికి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చిన్న కార్లపై జీఎస్‌టీ రేటు 28శాతం నుండి 18శాతానికి తగ్గించగా, ఎస్‌యూవీలపై 40శాతానికి పరిమితం చేశారు. ఎలక్ట్రిక్ కార్లపై పాత 5శాతం రేటు కొనసాగుతోంది. ఈ నిర్ణయం వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని అధికారులు తెలిపారు. హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ధరలను కొత్త జీఎస్‌టీ రేట్ల మేరకు తగ్గించనున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబర్ 22 నుంచి ఈ తగ్గింపులు అమల్లోకి రానున్నాయి. కంపెనీలు ఈ లాభాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.
Details
హ్యుందాయ్ కారు మోడళ్లపై తగ్గింపు
గ్రాండ్ ఐ10 నియోస్: ₹73,808 వరకు ఔరా: ₹78,465 వరకు ఎక్స్‌టర్: ₹89,209 వరకు ఐ20: ₹98,053 వరకు ఐ20 ఎన్ లైన్: ₹1,08,116 వరకు వెన్యూ: ₹1,23,659 వరకు వెన్యూ ఎన్ లైన్: ₹1,19,390 వరకు వెర్నా: ₹60,640 వరకు క్రెటా: ₹72,145 వరకు క్రెటా ఎన్ లైన్: ₹71,762 వరకు అల్కాజార్: ₹75,376 వరకు టక్సన్: ₹2,40,303 వరకు
Details
టాటా మోటార్స్ కారు మోడళ్లపై తగ్గింపు
టియాగో: ₹75,000 వరకు టిగోర్: ₹80,000 వరకు ఆల్ట్రోజ్: ₹1,10,000 వరకు పంచ్: ₹85,000 వరకు నెక్సాన్: ₹1,55,000 వరకు కర్వ్: ₹65,000 వరకు హారియర్: ₹1,40,000 వరకు సఫారి: ₹1,45,000 వరకు హ్యుందాయ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్సూ కిమ్, టాటా మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర ఇలా తీసుకున్న ఈ జీఎస్‌టీ తగ్గింపు నిర్ణయం వాహనాల కొనుగోలుదారులకు సౌకర్యం కల్పిస్తూ, కొత్తతరం వినియోగదారులకు కార్లను మరింత చేరువ చేస్తుందని పేర్కొన్నారు. కొత్త ధరల విధానం వల్ల వాహనాల మార్కెట్‌లో ఆకర్షణ పెరుగుతుందని, తొలిసారి కారు కొనేవారికి ఇది ప్రత్యేక అవకాశమని కంపెనీలు పేర్కొన్నాయి.