
GST Relief: కొత్త GST రేట్ల వల్ల కార్లు,బైకుల ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా?
ఈ వార్తాకథనం ఏంటి
జీఎస్టీ (GST) శ్లాబుల మార్పులతో చిన్నకార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10శాతం తగ్గనుంది. ఇదే విధంగా, రోజువారీ వాడుకలో ఉన్న చిన్న బైకులకు కూడా పన్ను రిలీఫ్ లభించింది. ఇప్పటికే ప్రభుత్వం ఆదాయపు పన్నులో రూ.12 లక్షల వరకు ఉపశమనం ఇచ్చింది. వడ్డీరేట్లు తగ్గడం వల్ల ఆటో మొబైల్ రంగంలో విక్రయాలు పెరిగేందుకు అనుకూల పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జీఎస్టీ కోతలు ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తాయి. మరోవైపు, భారీ బైకులు, లగ్జరీ కార్లపై పన్ను పెంచడం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసింది.
వివరాలు
లబ్ధి పొందే వాహనాలు
1500 సీసీ వరకు ఉన్న డీజిల్,డీజిల్ హైబ్రిడ్ కార్లు,1200 సీసీ వరకు ఉన్న పెట్రోల్,పెట్రోల్ హైబ్రిడ్, CNG, LPG కార్లకు కొత్త పన్ను శ్లాబ్ ప్రకారం 18% GST మాత్రమే వర్తిస్తుంది,సెస్సు లేదు. ఉదాహరణకు టాటా ఆల్ట్రోజ్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ ఐ10, ఐ20, రెనో క్విడ్ వంటి వాహనాల ధరలు తగ్గనున్నాయి. గతంలో ఈ వాహనాలపై 28% GST ఉండేది, అలాగే ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 1-3% సెస్సు విధించబడేది. చిన్నకారు ధరలు సాధారణంగా రూ.6-10 లక్షల మధ్య ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారులు రూ.60,000 నుంచి రూ.1 లక్ష వరకు ఆదా పొందవచ్చు. అయితే, కంపెనీలు ఈ లబ్ధిని వినియోగదారులకు ఎటువంటి కారణం చూపకుండా బదిలీ చేయాల్సి ఉంటుంది.
వివరాలు
మోటార్‌సైకిళ్లు
అత్యధికంగా వినియోగించే బజాజ్ పల్సర్, హీరో స్ప్లెండర్ వంటి వాహనాలపై GST 28% నుంచి 18%కి తగ్గింది, తద్వారా వినియోగదారులు పన్ను భారం తగ్గిన ప్రయోజనాన్ని పొందుతున్నారు. పన్ను పెంపు గల వాహనాలు 350 సీసీకి పైగా సామర్థ్యం కలిగిన బైకులు, ముఖ్యంగా ఎన్‌ఫీల్డ్, కేటీఎం వంటి ప్రీమియం వాహనాలపై GST 28% నుంచి 40%కి పెరిగింది. అదనంగా 3% సెస్సు విధించబడుతుంది. మధ్యశ్రేణి, భారీ ఎస్‌యూవీలపై కూడా పన్ను 28% నుంచి 40%కి చేరింది. ప్రస్తుతం ఈ వాహనాలపై 28% GST, 17-22% సెస్సు విధించబడుతూ పన్ను రేటు 45-50% మధ్యలో ఉంది. కొత్త శ్లాబ్ ప్రకారం,నేరుగా GST 40% మాత్రమే విధించబడుతుంది,5-10% వరకు సెస్సు రూపంలో వినియోగదారులకు మిగిలిపోతుంది.
వివరాలు
వ్యవసాయం, ట్రాక్టర్లు, వాణిజ్య వాహనాలు
ఈ శ్రేణిలోకి టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700, మారుతీ గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా వంటి వాహనాలు వస్తాయి. విద్యుత్తు వాహనాలపై 5% GST రేటు కొనసాగుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు మరింత చౌకగా మారి రైతులకూ అందుబాటులోకి వస్తాయి. వాణిజ్య వాహనాల ధరలు కూడా తగ్గుతాయి. దీని ద్వారా ఎక్కువ మంది వ్యక్తిగత వాహనాలను వినియోగించే అవకాశం పెరుగుతుంది. ఈ నిర్ణయాలు డిమాండ్‌ను మరింత పెంచేలా రూపొందించబడ్డాయని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో CEO రాజేష్ జెజురికర్ తెలిపారు. ఏప్రిల్-జూన్‌లో ప్యాసింజర్ వాహనాల డిమాండ్ 1.4% తగ్గింది. ఆ సమయంలో 1.01 మిలియన్ వాహనాలు మాత్రమే అమ్మబడ్డాయి. టూవీలర్స్ విభాగంలో డిమాండ్ 6.2% పడిపోయింది.