
Mahindra Electric Car: మహీంద్రా EVలపై విపరీతమైన డిమాండ్.. వెయిటింగ్ పీరియడ్ ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా అండ్ మహీంద్రా ఇటీవల విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలైన బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈకి మార్కెట్లో భారీ స్పందన లభిస్తోంది.
కంపెనీ ఇప్పటికే ఈరెండు మోడల్స్‌లో 3,000 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసింది. అయితే గణనీయమైన డిమాండ్‌కు ఈ సంఖ్య సరిపోకపోవడంతో వెయిటింగ్ పీరియడ్ అమాంతం పెరిగిపోయింది.
బీఈ 6, ఎక్స్‌ఈవీ 9ఈ వాహనాలకు ప్రస్తుతం సగటున 6 నెలల వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది. మహీంద్రా అధికారికంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
వినియోగదారుల మధ్య ఎక్స్‌ఈవీ 9ఈ అత్యధిక ఆదరణ పొందింది.
మొత్తం బుకింగ్స్‌లో 59 శాతం వాటా ఈ మోడల్‌దే. బీఈ 6కి 41 శాతం డిమాండ్ ఉండగా, చాలా మంది టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను ఎంపిక చేస్తున్నారు.
Details
భారీ బుకింగ్స్.. వేల కోట్ల విలువ
ఎక్స్‌ఈవీ 9ఈ, బీఈ 6 కలిపి ఇప్పటి వరకు రూ.8,472 కోట్ల విలువైన 30,179 యూనిట్లకు బుకింగ్స్ వచ్చాయి. ఇది మార్కెట్లో ఈ మోడల్స్‌కు ఉన్న క్రేజ్‌ను బలంగా తెలియజేస్తోంది.
ఈ రెండు ఎలక్ట్రిక్ మోడల్స్‌లో బీవైడీ నుంచి దిగుమతి చేసిన బ్యాటరీ ప్యాక్స్ వాడుతున్నారు. వీటిలో వెనుక చక్రాలను నడిపే రేర్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌లు ఉండగా, 228 బీహెచ్‌పీ (59 కిలోవాట్లు), 282 బీహెచ్‌పీ (79 కిలోవాట్లు) శక్తిని ఉత్పత్తి చేస్తాయి.
గరిష్టంగా 380 ఎన్ఎమ్ టార్క్‌ను కలిగి ఉంటాయి.
వేగం విషయంలో ఎక్స్‌ఈవీ 9ఈ 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 6.8 సెకన్లలో చేరుతుంది. బీఈ 6 6.7 సెకన్లలో ఈ గరిష్ట వేగాన్ని అందుకుంటుంది.
Details
రేంజ్‌లోనూ ప్రభావవంతమైన ప్రదర్శన
ఎక్స్‌ఈవీ 9ఈలో 59 కిలోవాట్ల బ్యాటరీకు 542 కిలోమీటర్ల ఎఆర్ఎఐ సర్టిఫైడ్ రేంజ్ లభిస్తే, 79 కిలోవాట్ల బ్యాటరీ వర్షన్ 656 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది.
బీఈ 6లో 557 కిలోమీటర్లు (59 కిలోవాట్లు), 683 కిలోమీటర్లు (79 కిలోవాట్లు) వరకూ ప్రయాణించగలదు.
అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు, ధరలు
భారత ప్రభుత్వ NCAP క్రాష్ టెస్టుల్లో ఈ రెండు ఎస్‌యూవీలు 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి.
బీఈ 6 ధరలు రూ.18.90 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, ఎక్స్‌ఈవీ 9ఈ ధర రూ.21.90 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ఈ విధంగా, మహీంద్రా ఎలక్ట్రిక్ విభాగం అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లు, సురక్షితత, మంచి రేంజ్‌తో మార్కెట్లో గట్టి స్థానం ఏర్పరచుకుంటోంది.