
Hyundai Creta EV: భారతీయ ఆటో మార్కెట్‌లో సంచలనం.. హ్యుందాయ్ క్రెటా EV.. అదిరిపోయిన ఫీచర్స్..
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా & మహీంద్రా, తమ రెండు ఎలక్ట్రిక్ కార్లు BE 6e,XEV 9eలను విడుదల చేయడం ద్వారా భారతీయ ఆటో మార్కెట్‌లో సంచలనం సృష్టించింది
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న ఈ సమయంలో, హ్యుందాయ్ కూడా ఈ రంగంలో సుమారు పోటీని ఎదుర్కొనడానికి సిద్ధమైంది.
2025 జనవరిలో, మహీంద్రా BE 6e కి ప్రత్యర్థిగా హ్యుందాయ్ ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
హ్యుందాయ్ మోటార్స్,తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేయనుంది.
ఈ క్రెటా EV ని 2025 లో జరగనున్న'ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో'(ఆటో ఎక్స్‌పో 2025)లో ఆవిష్కరించేందుకు కంపెనీ సిద్ధమవుతోంది..ఈ క్రెడా EV ప్రత్యేకతలు ఎమిటో చూద్దాం...
వివరాలు
హ్యుందాయ్ క్రెటా EV ఫీచర్లు
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, క్రెటా EV అందులో క్రెటా SUVకు పోలిక ఉంటుంది.
దీనిలో EV అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేయబడ్డాయి.
ఫ్రంట్ గ్రిల్‌లో మరికొన్ని మార్పులు కనిపిస్తాయి, అలాగే కారుపై EV బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. అదనంగా, ఈ కారులో ఏరో-ఎఫెక్టివ్ అల్లాయ్ టైర్లను అందిస్తున్నారు.
పవర్ పరంగా, క్రెటా EV 45 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది.
ఇది 138 బిహెచ్‌పి శక్తిని,255 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
BE 6e చాలా శక్తివంతమైనది
మహీంద్రా BE 6e, MG విండ్సర్ EV, టాటా కర్వ్ EV, MG ZS EV, మారుతి సుజుకి ఎవిటారా వంటి కార్లతో ఇది ప్రత్యక్ష పోటీలో ఉంటుంది.
మహీంద్రా ఇటీవల విడుదల చేసిన BE 6e, 79 kWh బ్యాటరీ ప్యాక్‌తో 362 బిహెచ్‌పి శక్తి ,380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ కారు 7 సెకన్లలో 100 kmph వేగాన్ని సాధించగలదు.పూర్తి ఛార్జ్‌తో ఇది 500 కిమీ రేంజ్‌ను అందించగలదు. ఈ కార్ ప్రారంభ ధర రూ. 18.90 లక్షలు అని కంపెనీ వెల్లడించింది.
హ్యుందాయ్ క్రెటా EV మార్కెట్లో మరో మంచి ఎంపికగా నిలిచే అవకాశం ఉంది. మరింత పోటీతో ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి.