
మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా
ఈ వార్తాకథనం ఏంటి
హ్యుందాయ్ వెర్నా 2023 కారు మార్చి 21న భారతదేశంలోలాంచ్ కానుంది. హ్యుందాయ్ వెర్నా 2023 వెర్షన్ కారును లాంచ్ చేయడానికి హ్యుందాయ్ మోటార్స్ సిద్ధమైంది.
ఇప్పటికే ఈ కారు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుత మోడల్ కంటే మరింత పెద్దగా, పవర్‌ఫుల్‌గా, సరికొత్త ఫీచర్లతో వస్తుంది. ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్(ADAS) టెక్నాలజీతో ఈ సరికొత్త సెడాన్ మార్కెట్లోకి అడుగుపెడతుంది. ఈ సెగ్మెంట్‌లో మిగతవాటికంటే అత్యంత వెడల్పుగా ఉండేది ఇదే.
1.5 లీటర్ నేచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. అలాగే ఇందులో టర్బోచార్జ్ ఇంజిన్ వేరియంట్ కూడా ఉంటుంది. ఈ రెండు ఇంజిన్ వేరియంట్‌లు సిక్స్-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్ బాక్సెస్‌లతో వస్తాయి.
కార్
17 ఫీచర్లతో హ్యుందాయ్ స్మార్ట్ సెన్సార్‌ను ఉపయోగించే లెవెల్ 2 ADAS ఈ కారులో ఉంటుంది
17 ఫీచర్లతో హ్యుందాయ్ స్మార్ట్ సెన్సార్‌ను ఉపయోగించే లెవెల్ 2 ADAS ఈ కారులో ఉంటుంది. కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లెన్ కీప్ అసిస్ట్, లెన్ డిపాచర్ వార్నింగ్ వంటి ఫీచర్లతో ఇదే టెక్నాలజీతో మార్కెట్లో విడుదల అయిన హోమ్‌డా సిటీ ఫేస్‌లిఫ్ట్ కు పోటీగా ఉంటుంది.
హ్యుందాయ్ వెర్నా ప్రస్తుత మోడల్ ధర రూ.9.63 లక్షల నుండి 15.71లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ సరికొత్త జనరేషన్ హ్యుందాయ్ వెర్నా 2023 రూ.11లక్షల నుండి రూ.18లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.