
జూలై 10న హ్యుందాయ్ ఎక్స్‌టర్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
హ్యుందాయ్ కంపెనీ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టర్ జూలై 10న భారత మార్కెట్లోకి లాంచ్ కానుంది. ఇప్పటివరకూ డిజైన్, ఫీచర్స్, బుకింగ్స్ వంటి వివరాలను తెలియజేసిన కంపెనీ తాజాగా లాంచ్ తేదీని ప్రకటించింది.
మారుతి సుజుకి ఇన్విక్టో, కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హ్యుందాయ్ తీసుకొస్తున్న ఎక్స్‌టర్ మోడల్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ SUV అధునాతన ఫీచర్లతో పాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమెరా డాష్‌క్యామ్ సెటప్‌తో వస్తుంది.
ఇప్పటికే రూ. 11,000తో బుకింగ్స్ ప్రారంభించిన హ్యుందాయ్, డెలివరీలను కూడా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తోంది.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇండియాలో అందుబాటులో ఉన్న ఇతర వాహనాలSUVలతో పోలిస్తే ప్రత్యేకమైన డిజైన్‌తో ముందుకొస్తోంది.
Details
ఇతర ఎస్‌యూవీలకు గట్టి పోటీ ఇవ్వనున్న హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో హెచ్ షేప్ ఎల్ఈడీ డిఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, సి పిల్లర్‌కు టెక్స్‌చర్డ్ ఫినిషింగ్ వంటివి ఉండనున్నాయి.
అదే విధంగా ఫ్లోటింగ్ రూఫ్ ఎఫెక్ట్‌తో డ్యూయల్ టోన్ పెయింట్ ఆప్షన్‌లు గమనించవచ్చు. రియర్ ప్రొఫైల్‌లో నిలువుగా ఉండే టెయిల్ గేట్, షార్క్ ఫిన్ యాంటెన్నా, బిల్ట్-ఇన్ స్పాయిలర్, టెయిల్-ల్యాంప్ వంటివి అకర్షణీయంగా రూపొందించారు.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ.6 లక్షల నుండి 10 లక్షల లోపు ఉండొచ్చు.
ఇది మారుతి సుజుకి ఇగ్నిస్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, సిట్రోయెన్ C3, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లకు పోటీగా నిలుస్తుందని మార్కెట్లో అంచనాలు వెలువడుతున్నాయి.