ICC World Cup 2023: వరల్డ్ కప్‌కు స్పాన్సర్‌గా మహీంద్రా కంపెనీ
దేశీయ మార్కెట్ తమ బ్రాండ్ విలువను పెంచుకునేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కి స్టార్ స్పోర్ట్స్‌తో కలిసి అసోసియేట్ స్పాన్సర్‌గా మహీంద్రా వ్యవహరించనుంది. దీంతో తమ కార్ల అమ్మకాలను పెంచుకోవాలని మహీంద్రా భావిస్తోంది. భారత్‌లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెట్ ద్వారా ప్రజల్లోకి మరింత వెళ్లేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాం 'డిస్నీ+ హాట్ స్టార్' కూడా వరల్డ్ కప్‌కు స్పాన్సర్గా ఉండనుంది.
మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్ల ఆధ్వర్యంలో ఈవెంట్లు
ఈ నేపథ్యంలో ఐసీసీ వరల్డ్ సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా డీలర్ల ఆధ్వర్యంలో కొన్ని ఈవెంట్లను నిర్వహించనుంది. ఇక మహీంద్ర కంపెనీ ఆటో మొబైల్, ఫార్మింగ్ సెక్టార్లలో అగ్రగామిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆగస్టులో మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 19 శాతం పెరిగాయి. ఇక అక్టోబర్ 5న నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. నవంబర్ 19న జరిగే ఫైనల్ మ్యాచుతో వరల్డ్ కప్ ముగియనుంది.