Page Loader
Kia EV2: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కియా ఈవీ2 వచ్చేస్తోంది..!
అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కియా ఈవీ2 వచ్చేస్తోంది..!

Kia EV2: అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కియా ఈవీ2 వచ్చేస్తోంది..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2023
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

కియా మోటర్స్ సంస్థ ఈవీ సెగ్మెంట్‌లో ఫ్యూచరిస్టిక్ డిజైన్ మోడల్స్‌తో దూసుకెళ్తుతోంది. ఈ సంస్థ మరో మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలను చేస్తోంది. 2026 నాటికి కియా ఈవీ2 ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. దీని ధర దాదాపుగా రూ.25.6 లక్షలు ఉండనుంది. తొలుత ఈ వెహికల్‌ని యూరోపియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని సమాచారం. ఇక ఈవీ సిరీస్‌లో అతి తక్కువ చౌకైన మోడల్‌గా ఇది నిలువనుంది. నగరాల్లో ఉపయోగకరంగా ఉండేందుకు దీని డిజైన్ ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇక ఈవీ2కి సంబంధించి ప్రస్తుతం వివరాలేవీ బయటకి రాలేదు. యూరోపియన్ ప్రజల అభిరుచులకు అనుగుణంగా ఇందులో మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం.

Details

ఈవీ 5 ఫీచర్లను రిలీజ్ చేసిన కియా

కియా మోటర్స్‌లో సిగ్నేచర్‌గా మారిన డిజిటల్ టైగర్ నెస్ గ్రిల్‌ ఇందులో ఉండనుంది. రానున్న కియా ఈవీ2లో ఈ-జీఎంపీ మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌కి చెందిన సరికొత్త 400వీని సంస్థ వాడుతుందని తెలుస్తోంది. అయితే ఈ వెహికిల్‌కి అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ ఉండకపోవచ్చు. 2030 నాటికి 1.6 మిలియన్ EVలను విక్రయించాలని కియా మోటార్స్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈవీ5 ఫీచర్లను రిలీజ్ చేసింది. ఈ కియా ఈవీ మొత్తం 3 వేరియంట్లలో రానుంది. స్టాండర్ట్ వేరియంట్, లాంగ్ రేంజ్ వేరియంట్, లాంగ్ రేంజ్ ఏడబ్ల్యూడీ వేరియంట్ ఉండనున్నాయి.