Page Loader
Kia Sonet : 2024 కియా సోనెట్ బుకింగ్‌లు ఎప్పుడో తెలుసా
2024 కియా సోనెట్ బుకింగ్‌లు ఎప్పుడో తెలుసా

Kia Sonet : 2024 కియా సోనెట్ బుకింగ్‌లు ఎప్పుడో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 04, 2023
07:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలోని ఆటో మార్కెట్లో 2024 కియా మోటర్స్ (సొనెట్) కోసం అనధికారికంగా బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు కొన్ని డీలర్‌షిప్‌లు 2024 కియా సోనెట్ కోసం అనధికారికంగా బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించాయి. దీనికి టోకెన్ గానూ రూ.20,000 వేలు రుసుంగా నిర్ణయించింది. భారత ఆటో మార్కెట్లో ఆధునీకరించిన కియా సోనెట్ అధికారిక ఆవిష్కరణ డిసెంబర్ 14, 2023న లాంఛ్ కానుంది. ఈ మేరకు రిఫ్రెష్ చేయబడిన మోడల్'లో గ్రిల్, కొత్త అల్లాయ్ రిమ్‌లను పునరుద్ధరించారు. 2023 సెల్టోస్ స్ఫూర్తితో కనెక్ట్ చేయబడిన LED టైల్‌లైట్‌ని కలిగి ఉంటుంది. 2024 సోనెట్ ఫ్రంట్ ఎండ్ కొత్త ఇన్సర్ట్‌లు, అప్‌డేట్ చేయబడిన LED హెడ్‌లైట్‌లు సహా DRLలతో రీడిజైన్ చేయబడిన గ్రిల్‌ను కలిగి ఉంటుంది.

details

ప్రస్తుత సోనెట్ కంటే ధర ఎక్కువే ఉంటుందని సమాచారం 

మరోవైపు చక్రాల కొత్త రూపాన్ని మినహాయించి, సైడ్ ప్రొఫైల్ ప్రస్తుత మోడల్లో పెద్దగా మార్పుల్లేవ్. లోపల, క్యాబిన్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సుపరిచితమైన డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. పెట్రోల్,డీజిల్ ఇంజిన్ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.కియా సోనెట్ దాని ప్రస్తుత ఇంజిన్ ఎంపికలను కొనసాగిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 118.3hp, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్, 82hp, 1.2-లీటర్ పెట్రోల్, 114.4hp, 1.5-లీటర్ డీజిల్ యూనిట్. ఇంజన్ ఎంపికను బట్టి వాహనంపై ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT, 6-స్పీడ్ AT లేదా 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి. 2024ప్రారంభంలో ధరలు ప్రకటించనున్నారు.ప్రస్తుత సోనెట్ కంటే ధర రూ. 7.79 లక్షలు (ఎక్స్-షోరూమ్) అధికంగా ఉండవచ్చు.