Page Loader
Lotus : లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం
లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం

Lotus : లోటస్ థియరీ 1 ఆవిష్కరణ... ఒక్కసారి ఛార్జ్‌తో 402 కి.మీ ప్రయాణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 18, 2024
04:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

లోటస్ తన సరికొత్త ఎలక్ట్రిక్ సూపర్ కార్ కాన్సెప్ట్ అయిన థియరీ 1ను ఆవిష్కరించింది. 1,000 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్‌తో ఇది మోటార్ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించనుంది. ఈ మూడు-సీట్ల సూపర్ కార్ త్వరలో ఉత్పత్తిలోకి వెళ్లనుంది. సిరీస్ 1 ఎస్ప్రిట్‌ మాదిరి డిజైన్‌ ప్రభావాలతో, థియరీ 1 లోటస్‌ కార్ల భవిష్యత్ మోడళ్లకు మార్గదర్శిగా నిలవనుంది. ఇది 'లోటస్ థియరీ' డిజైన్ మ్యానిఫెస్టోను పరిచయం చేసింది. ఈ కాన్సెప్ట్‌ కారు లోటస్‌ యొక్క కోవెంట్రీ ఆధారిత డిజైన్‌ సెంటర్‌లో రూపొందించారు. 4,490mm పొడవు, 2,000mm వెడల్పు, 1,140mm ఎత్తుతో పాటు 2,650mm వీల్‌బేస్ కలిగిన ఈ కారు అత్యాధునిక డిజైన్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.

Details

వంద కిలోమీటర్ల వేగాన్ని 2.5 సెకన్లలో అందుకోగలదు

కారు ముందుభాగంలో డ్రాగ్‌ను తగ్గించేందుకు ప్రత్యేక ఎయిర్ డిఫ్లెక్టర్‌లు, ఫ్రంట్-ఎండ్ డిఫ్యూజర్‌లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కారు వేగం పెరిగే సమయంలో డ్రాగ్‌ను తగ్గిస్తూ, గరిష్ట డౌన్‌ఫోర్స్‌ సాధించగలిగేలా డిజైన్‌ చేశారు. థియరీ 1 మూడు సీట్ల లేఅవుట్‌తో డిజైన్ చేశారు. ఇందులో డ్రైవర్ సీటు మధ్యలో ఉంటుంది. దీనికి చుట్టూ రెండు ప్రయాణీకుల సీట్లు అమర్చారు. కారు పవర్‌ట్రెయిన్‌ ట్విన్-మోటార్ ఆల్-వీల్-డ్రైవ్‌తో పనిచేస్తుంది. 70kWh బ్యాటరీతో 1,000 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. 0-100 కిమీ వేగాన్ని 2.5 సెకన్లలో అందుకోగలదు. థియరీ 1 గరిష్టంగా 320 కిమీ/గం వేగంతో ప్రయాణించగలదు. 70kWh బ్యాటరీ సాయంతో ఒక్క ఛార్జ్‌లో 402 కిమీ వరకు ప్రయాణించగలదు.