LOADING...
Mahindra BE 6 batman: మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్: భారీ డిమాండ్, 999 యూనిట్ల ప్రత్యేక బుకింగ్ ప్రారంభం
మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ కి భారీ డిమాండ్

Mahindra BE 6 batman: మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్: భారీ డిమాండ్, 999 యూనిట్ల ప్రత్యేక బుకింగ్ ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 22, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్‌కు ఊహించని ఆదరణ లభించింది! మొదట కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయాలని భావించిన ఈ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు భారీ డిమాండ్ కారణంగా 999 యూనిట్లకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు తమకు ఇష్టమైన బ్యాడ్జ్ నంబర్ (001-999)ను ఎంచుకునే అవకాశం పొందుతున్నారు. ప్రీ-బుకింగ్‌లు ఆగస్ట్ 21 సాయంత్రం 5 గంటలకు 'యాడ్ యువర్ ప్రిఫరెన్స్' ఫీచర్‌తో ప్రారంభమయ్యాయి. దీని ద్వారా బుకింగ్ ప్రక్రియ మరింత సులభమవుతుంది. అధికారిక బుకింగ్‌లు ఆగస్ట్ 23 ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్ కార్ బుక్ చేసుకోవచ్చు.

వివరాలు 

ఇంటీరియర్ ప్రత్యేకతలు 

కారు లోపలి భాగం పూర్తిగా ప్రత్యేకంగా అలంకరించబడింది. ఇందులో స్వేడ్, లెదర్ వాడకం, గోల్డ్ సెపియా యాక్సెంట్ స్టిచింగ్, పలు చోట్ల బ్యాట్ చిహ్నాలు కనిపిస్తాయి. డాష్‌బోర్డ్‌లో బ్రష్డ్ ఆల్కెమీ గోల్డ్ బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ స్లేట్, ప్రత్యేక నంబరింగ్ దీన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. చార్‌కోల్ లెదర్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను బ్రష్డ్ గోల్డ్ హలో మరింత ఆకర్షణీయంగా మార్చుతుంది. డ్రైవర్ చుట్టూ ఉండే ప్రాంతంలో స్టీరింగ్ వీల్,ఇన్-టచ్ కంట్రోలర్,ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్‌లలో గోల్డ్ యాక్సెంట్స్ ఉన్నాయి. కీ ఫాబ్ కూడా ఆల్కెమీ గోల్డ్‌తో అలంకరించబడింది. 'బూస్ట్' బటన్, సీట్‌బ్యాక్‌లు, ఇంటీరియర్ లేబుళ్లు, ప్యాసెంజర్ వైపు డాష్‌బోర్డ్‌లోని పిన్‌స్ట్రైప్ గ్రాఫిక్‌పై కూడా బ్యాట్ చిహ్నం ముద్రించబడింది.

వివరాలు 

ఇంటీరియర్ ప్రత్యేకతలు 

రేస్‌కార్ శైలిలో రూపొందించిన డోర్ స్ట్రాప్స్, ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేలో బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ వెల్కమ్ యానిమేషన్, 'డార్క్ నైట్' థీమ్‌ను మరింత హైలైట్ చేస్తాయి. అలాగే, కారు ఎక్స్‌టీరియర్ సౌండ్స్ బ్యాట్‌మొబైల్ నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉన్నాయి.

వివరాలు 

స్పెసిఫికేషన్లు 

మెకానికల్ పరంగా, బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్‌తో సమానంగా ఉంటుంది. ఇది 3 వేరియంట్‌లతో రూపొందించబడింది,ఇందులో పెద్ద 79కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని సింగిల్ ఛార్జ్‌పై 682 కిమీల వరకు రేంజ్ ఇస్తుంది. 59 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 230 బీహెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది,అయితే 79కేడబ్ల్యూహెచ్ వేరియంట్ 285 బీహెచ్‌పీ శక్తిని అందిస్తుంది. రెండు వేరియంట్లు కూడా 380ఎన్‌ఎం టార్క్ కలిగి ఉంటాయి. బీఈ 6 ఎలక్ట్రిక్ కారు 175 కేడబ్ల్యూహెచ్ వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 20 నిమిషాల్లో 20-80% వరకు ఛార్జ్ సాధ్యమవుతుంది.మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 27.79 లక్షలుగా ఉంది.