Mahindra BE 6 : మహీంద్రా బీఈ 6.. భారత మార్కెట్లో మచ్ అవైటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత మార్కెట్లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో మహీంద్రా బీఈ 6 ఒకటి. ఈ మోడల్ ధరలను ఇటీవలే కంపెనీ ప్రకటించింది.
ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.90 లక్షల నుంచి రూ.26.90 లక్షల వరకు ఉంది. బీఈ 6 మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వస్తోంది.
ఈ నేపథ్యంలో కస్టమర్లు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మిడ్-స్పెక్ వేరియంట్ అయిన 'ప్యాక్ టూ' ప్రత్యేకతలను తెలుసుకుందాం.
మహీంద్రా బీఈ 6 ప్యాక్ టూ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.21.90 లక్షలు. ఇది టాటా కర్వ్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ హై ఎండ్ వేరియంట్ల ధరతో సమానం.
Details
ముఖ్యమైన ఫీచర్లు ఇవే
ఈ వేరియంట్‌లో ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఇందులో సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్, స్టార్టప్ లైటింగ్ సీక్వెన్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, కార్నరింగ్ లైట్స్, ఆటో బూస్టర్ లైట్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
అదనంగా, మిడ్-స్పెక్ వేరియంట్‌లో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంటీరియర్‌లో క్యాబిన్ ప్రీమియం ఫీల్‌ను కలిగించేలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అప్‌హోల్స్‌టరీ అందించారు.
16 స్పీకర్ల హర్మన్-కార్డాన్ ఆడియో సిస్టమ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో లభిస్తుంది. స్మార్ట్ యాక్సెస్ కోసం ఎన్ఎఫ్‌సీ కీ, రియర్ ఏసీ వెంట్స్, పార్శిల్ షెల్ఫ్ వంటి అదనపు సౌకర్యాలున్నాయి.
Details
భద్రత, డ్రైవింగ్ అసిస్టెన్స్
భద్రత పరంగా, బీఈ 6 ప్యాక్ టూ వేరియంట్ లెవల్ -2 ఏడీఏఎస్ సిస్టమ్‌ను కలిగి ఉంది. మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోసం రాడార్, కెమెరా సెటప్ అందించారు.
అదనంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమెటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీచర్లు అందించారు.
బ్యాటరీ, పెర్ఫార్మెన్స్
ఈ వేరియంట్‌లో 59 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ అందించారు. ఇది మార్కెట్లో ఇతర మోడళ్ల కంటే గణనీయంగా పెద్దది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 535 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని మహీంద్రా పేర్కొంది.
175 కిలోవాట్ల వరకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయగలదు. కేవలం 20 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ చేసే అవకాశం ఉంటుంది.
Details
పవర్, డ్రైవింగ్ మోడ్‌లు
బీఈ 6 ప్యాక్ టూ రేర్ వీల్ డ్రైవ్ సెటప్‌తో 230 బీహెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇందులో రేంజ్, ఎవిరిడే, రేస్ మోడ్‌లతో పాటు బూస్ట్ మోడ్, వన్-పెడల్ డ్రైవ్ మోడ్ వంటి ప్రత్యేకమైన డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి.
మొత్తానికి, బీఈ 6 ప్యాక్ టూ వేరియంట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్‌గా నిలుస్తుంది. అధునాతన ఫీచర్లు, మైలేజ్, స్టైలిష్ డిజైన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా మారనుంది.