Mahindra Scorpio N: భారత మార్కెట్‌లోకి మహీంద్రా స్కార్పియో N బ్లాక్ ఎడిషన్ వచ్చేస్తోంది..
ఈ వార్తాకథనం ఏంటి
మహీంద్రా అండ్ మహీంద్రా తమ స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ ఎస్‌యూవీకి సంబంధించిన కొత్త టీజర్‌ను బ్రాండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసింది.
తాజా సమాచారం ప్రకారం, అప్‌డేటెడ్ మోడల్ ఇప్పటికే కొన్ని డీలర్‌షిప్ యార్డులకు చేరుకుంది. అందువల్ల, ఈ ప్రత్యేక ఎడిషన్ త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశముంది.
వివరాలు
మహీంద్రా స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్ స్పెషాలిటీ ఏమిటి?
ఈ బ్లాక్ ఎడిషన్ ప్రధానంగా కాస్మొటిక్ మార్పులతో వస్తోంది. దీనిలో బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ ఉంటాయి.
అంతేకాకుండా, క్రోమ్ ఎలిమెంట్స్‌కి బ్లాక్ ఫినిషింగ్ అందించారు. అంతర్గతంగా కూడా బ్లాక్ లెదర్లెట్ అప్‌హోలిస్ట్రీ, స్టైలిష్ డ్యాష్‌బోర్డ్ డిజైన్ వంటి మార్పులు కనిపిస్తాయి.
మెకానికల్ మార్పులు ఉన్నాయా?
స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్‌లో మెకానికల్‌గా ఎటువంటి మార్పులు లేవు. ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.
వివరాలు
మెకానికల్ మార్పులు ఉన్నాయా?
పెట్రోల్ ఇంజిన్: 200 BHP పవర్, 380 Nm టార్క్
డీజిల్ ఇంజిన్: 173 BHP పవర్, 400 Nm టార్క్
లో-ఎండ్ డీజిల్ వేరియంట్: 132 BHP పవర్, 300 Nm టార్క్ (కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో)
ఇవి 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తాయి.
స్కార్పియో ఎన్ బ్లాక్ ఎడిషన్ వేరియంట్లు మహీంద్రా స్కార్పియో ఎన్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది: Z2, Z4, Z6, Z8 S, Z8, Z8 L.
వివరాలు
ధర వివరాలు
ప్రస్తుతం స్కార్పియో ఎన్ ధర రూ. 13.99 లక్షల నుండి రూ. 24.69 లక్షల వరకు ఉంది (ఎక్స్-షోరూమ్). అయితే, బ్లాక్ ఎడిషన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కస్టమర్లలో ఆసక్తి
స్కార్పియో ఎన్ మహీంద్రా కంపెనీకి హై డిమాండ్ ఉన్న మోడల్‌లలో ఒకటి. స్టైలింగ్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ వేరియంట్లతో ఇది కస్టమర్లను ఆకర్షిస్తోంది.