Maruti Suzuki: ఆగస్టులో ఆల్ టైం రికార్డు సృష్టించిన మారుతీ సుజుకీ విక్రయాలు
ఆగస్టులో మారుతీ సుజుకీ విక్రయాలు అల్ టైం రికార్డు సాధించాయి. కంపెనీ చరిత్రలో ఒక నెల వ్యవధిలో అత్యధిక విక్రయాలను గత నెలలోనే నమోదు చేసి రికార్డుకెక్కింది. ఆగస్టు నెలలో విక్రయాలు గరిష్టానికి చేరాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ టోకు విక్రయాలు గత నెలలో 1,89,082 యూనిట్లుగా నమోదు అవ్వగా, కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇదే ఇప్పటివరకూ అత్యధికం కావడం విశేషం. గతేడాది ఆగస్టులో 1,65,173 యూనిట్లు డీలర్లకు సరఫరా చేసింది. ఈ సారి ఏకంగా 14శాతం వృద్ధి నమోదు కావడం విశేషం.
16శాతం వృద్ధి సాధించిన మారుతీ సుజుకీ
విక్రయాలు గతేడాదితో పోలిస్తే 1,34,166 యూనిట్ల నుంచి 1,54,114 యూనిట్లకు పెరగడం విశేషం. ఈ విభాగంలో ఏకంగా 16శాతం వృద్ధి నమోదైంది. ఆల్టో, ఎస్-ప్రెసో వంటి చిన్న కార్ల విభాగంలో ఏడాది ప్రాతిపదికన అమ్మకాలు 22,162 నుంచి 12,209 యూనిట్లకు తగ్గడం విశేషం. ఇక బ్యాలెనో, సెలెరియా, డిజైర్, ఇగ్నిస్, స్విప్ట్ వంటి కంపాక్ట్ కార్ల విక్రయాలు 71,557 యూనిట్ల నుంచి 72,451 యూనిట్లకు పెరిగాయి. మరోవైపు బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్నీ, ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వెహికల్స్ విభాగంలో విక్రయాలు 58,746 యూనిట్లుగా నమోదయ్యాయి.