
MG ZS EV: సింగిల్ ఛార్జ్‌తో 460 కి.మీ వరకు రేంజ్..ఎంజీ జెడ్ఎస్ ఈవీపై భారీ ప్రైజ్ కట్ని ప్రకటించిన సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
JSW ఎంజీ మోటార్ భారతదేశంలో తన ఆరు సంవత్సరాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ,సంస్థ తన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUV అయిన ఎంజీ ZS EV వాహనానికి సంబంధించిన అన్ని వేరియంట్లపై భారీగా ధర తగ్గింపును ప్రకటించింది.
తాజాగా 2025 మోడల్ ZS EV ధర గరిష్ఠంగా రూ.4.44 లక్షల వరకు తగ్గించబడింది.ఇప్పుడు ZS EV ధరలు రూ.16.75లక్షల నుండి మొదలై రూ.20.50లక్షల వరకు(ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
ఈ ధర తగ్గింపుతో, టాటా కర్వ్ EV,హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా BE.6,ఎంజీ విండ్సర్ ప్రో (ఫిక్స్డ్ బ్యాటరీ వేరియంట్) వంటివి వెనుకపడే అవకాశం ఉండగా, ZS EV మరింత పోటీ ధరలో అందుబాటులోకి వచ్చింది.
వివరాలు
తాజా ఎంజీ ZS EV ధరలు - వేరియంట్ వారీగా వివరాలు:
1. వేరియంట్ పేరు: ఎగ్జిక్యూటివ్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: ₹16,75,000
పాత ఎక్స్-షోరూమ్ ధర: ₹16,88,000
తగ్గింపు మొత్తం: ₹13,000
2. వేరియంట్ పేరు: ఎక్సైట్ ప్రో
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: ₹18,49,800
పాత ఎక్స్-షోరూమ్ ధర: ₹18,97,800
తగ్గింపు మొత్తం: ₹48,000
3. వేరియంట్ పేరు: ఎక్స్‌క్లూజివ్ ప్లస్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: ₹19,49,800
పాత ఎక్స్-షోరూమ్ ధర: ₹23,64,800
తగ్గింపు మొత్తం: ₹4,15,000
4 వేరియంట్ పేరు: ఎస్సెన్స్
కొత్త ఎక్స్-షోరూమ్ ధర: ₹20,49,800
పాత ఎక్స్-షోరూమ్ ధర: ₹24,93,800
తగ్గింపు మొత్తం: ₹4,44,000
వివరాలు
ధర తగ్గింపు పై ఎంజీ అధికారిక స్పందన:
JSW ఎంజీ మోటార్ ఇండియా సేల్స్ హెడ్ రాకేష్ సేన్ మాట్లాడుతూ.. "గత ఆరేళ్లుగా భారత ఆటోమొబైల్ రంగంలో మేము సాధించిన పురోగతికి సహకరించిన మా కస్టమర్లు,డీలర్లు,ఇతర భాగస్వాములందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సంస్థ ఆవిష్కరణపై ఆధారపడిన దృక్పథంతో ముందుకు సాగుతోంది. ZS EV మోడల్‌ను మేము 2020లో లాంచ్ చేయగా,అది మా బ్రాండ్‌కు ప్రతిష్ఠను తెచ్చింది. సాంకేతికతతో నడిచే అభివృద్ధిని ప్రతిబింబించే ఈ వాహనం, సాంప్రదాయ రవాణా విధానాలకు ప్రత్యామ్నాయంగా నిలిచింది.
వివరాలు
ZS EV కూడా ప్రత్యేక ధరతో..
భారత మార్కెట్లో మా ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, స్టైలిష్ ఎలక్ట్రిక్ SUVను కోరుకునే వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చాం. ఇప్పటికే మా రెండు ఎలక్ట్రిక్ వాహనాలు సరసమైన ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ZS EV కూడా ప్రత్యేక ధరతో అందుబాటులోకి రావడంతో, ప్రీమియం కస్టమర్లను కూడా ఆకర్షించగలదని మేము విశ్వసిస్తున్నాము. అదనంగా, ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన ఈ వాహనం, ఖచ్చితంగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంటుంది" అని వ్యాఖ్యానించారు.
వివరాలు
బ్యాటరీ, రేంజ్ వివరాలు:
ఎంజీ ZS EVలో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఇది 461 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌కి సరిపడే ఉత్తమ రేంజ్‌లలో ఒకటిగా భావించబడుతోంది.
ధర తగ్గింపు ప్రభావం: ధర తగ్గింపుతో ZS EV మరింత ప్రతిస్పందనను పొందే అవకాశముంది. రాబోయే వారాల్లో ఈ వాహనానికి డిమాండ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వివరాలు
ఎంజీ ఇతర ఎలక్ట్రిక్ కార్లు - మార్కెట్లో ప్రభావం:
ZS EV భారత మార్కెట్లో ఎంజీ బ్రాండ్ నుంచి వచ్చిన రెండవ ఎలక్ట్రిక్ మోడల్. గత ఆరు నెలలుగా సగటున ఇది 600 యూనిట్లు విక్రయమవుతోంది.
మరోవైపు, ఎంజీ మరొక ఈవీ మోడల్ అయిన విండ్సర్ EV మార్కెట్‌ను షేక్ చేస్తూ ఉంది.
ఇది కేవలం ZS EV కాకుండా ఇతర ఈవీ వాహనాల అమ్మకాలను కూడా ప్రభావితం చేస్తోంది.
గత ఆరు నెలల్లో విండ్సర్ EV సగటున 3,450 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది.
2023 సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది 27,000 యూనిట్లకు పైగా విక్రయించబడింది, ఇది బ్రాండ్‌కు మరింత బలాన్ని ఇస్తోంది.