Page Loader
Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?
టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2023
11:05 am

ఈ వార్తాకథనం ఏంటి

టయోటా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లాన్జా, హైరిడర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక టయోటా మిడ్ సైజ్ ఎస్‌యూవీ త్వరలో లాంచ్ చేయడానికి ఇప్పటికే ప్రణాళికలు వేస్తోంది. గ్లాన్జా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ భారతదేశ విక్రయాలలో 40శాతం వాటాను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ, టయోటా, మారుతీ సుజుకీలో ఇప్పటికీ మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఎటువంటి ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టలేదు. XUV700, టాటా హారియర్, MG హెక్టర్ వంటి వాటికి ప్రత్యర్థిగా కొత్త ఎస్‌యూవీని తీసుకురావడానికి టయోటా ప్లాన్ చేస్తోంది. 340D అనే కోడ్‌నేమ్‌తో, టయోటా కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీని 2026లో ప్రారంభించాలని భావిస్తోంది.

Details

టయోటా నుంచి సరికొత్త లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ వెహికల్‌

తాజాగా భారత్ లో మూడో తయారీ ప్లాంటుకు ఏర్పాటుకు టయోటా శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతమున్న రెండు ప్లాంట్లు ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుండమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అదే విధంగా టయోటా నుంచి సరికొత్త లైఫ్ స్టైల్ ఆఫ్ రోడ్ వెహికల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ వాహనం హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైయిన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. టయోటా సంవత్సరానికి 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టయోటా కొత్త మిడ్-సైజ్ SUVలో పెద్ద టచ్‌స్క్రీన్, లెథెరెట్ అప్హోల్స్టరీ, డెడికేటెడ్ కనెక్టివిటీ సూట్, ADAS వంటి ఫీచర్లు ఉండొచ్చు.