Makoto Uchida: జపాన్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజీనామా.. కొత్త సీఈవోగా ఆయనే..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) మకోటో ఉచిడా తన పదవికి రాజీనామా చేశారు.
కంపెనీ ఆర్థిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉచిడా స్థానంలో ప్రస్తుతం చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా ఉన్న ఇవాన్ ఎస్పినోసా కొత్త CEOగా బాధ్యతలు స్వీకరిస్తారని నిస్సాన్ ప్రకటించింది.
అయితే, ఉచిడా కంపెనీ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు. జనరల్ షేర్ హోల్డర్ల సమావేశం వరకు ఆయన తన పదవిలో కొనసాగుతారు.
గడచిన నెలలో హోండా మోటార్ కంపెనీతో జాయింట్ హోల్డింగ్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి ఉచిడా జరిపిన చర్చలను నిలిపివేశారు.
వివరాలు
విలీన చర్చలను ఇక కొనసాగించబోమని స్పష్టం
ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ గురించి అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన హోండా, నిస్సాన్ కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటును యోచించాయి.
అయితే, తమ వ్యాపారాలను విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి.
సంస్థల బోర్డులు విలీన చర్చలను ఇక కొనసాగించబోమని స్పష్టం చేశాయి.
దీంతో ప్రపంచ వాహన మార్కెట్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అవతరించబోతుందనే అంచనాలకు తెరపడింది.
పెరుగుతున్న పోటీని ఎదుర్కొనడానికి హోండా, నిస్సాన్, మరో సంస్థ కలిసి పనిచేయాలని భావించినప్పటికీ, ప్రస్తుత చర్చల తీరు నిస్సాన్‌కు అనుకూలంగా లేదని ఉచిడా అభిప్రాయపడ్డారు.
వివరాలు
కొత్త CEO బాధ్యతలు చేపట్టిన అనంతరం నిస్సాన్ వ్యూహంలో మార్పులు
అంతేకాదు, నిస్సాన్‌ను హోండా అనుబంధ విభాగంగా మార్పు చేయాలనే ప్రతిపాదనకు తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు.
అయితే, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) సహా ఇతర పరిశోధనా ప్రాజెక్టుల విషయంలో నిస్సాన్,హోండా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుందని ఉచిడా పేర్కొన్నారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి నిస్సాన్ 80 బిలియన్ యెన్ (సుమారు 540 మిలియన్ డాలర్లు) నష్టాన్ని అంచనా వేసింది.
కొత్త CEO బాధ్యతలు చేపట్టిన అనంతరం నిస్సాన్ వ్యూహంలో మార్పులు చోటుచేసుకోవచ్చని,సంస్థ ఆర్థికంగా మరింత మెరుగైన పనితీరు కనబరిచే అవకాశముందని,మార్కెట్‌లో తన స్థానం బలోపేతం చేసుకునేలా చర్యలు తీసుకుంటుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.