NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Ola Electric: కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 వరకు తగ్గింపు 
    తదుపరి వార్తా కథనం
    Ola Electric: కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 వరకు తగ్గింపు 
    కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్

    Ola Electric: కొత్త BOSS ఆఫర్‌లను ప్రకటించిన ఓలా ఎలక్ట్రిక్.. S1 పోర్ట్ ఫోలియోపై రూ.20,000 వరకు తగ్గింపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 19, 2024
    09:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పండుగ సీజన్ ను పురస్కరించుకొని, భారతదేశంలో అతిపెద్ద ప్యూర్-ప్లే ఈవీ కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్, తన 'బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ - BOSS' క్యాంపెయిన్ లో భాగంగా పలు కొత్త ఆఫర్లను ప్రకటించింది.

    వినియోగదారులు ఇప్పుడు S1 పోర్ట్‌ఫోలియోపై రూ. 20,000 వరకు తగ్గింపులను పొందవచ్చు, అలాగే రూ. 25,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

    ఈ పండుగ సీజన్‌లో ఈవీకి మారేందుకు ఇదే సరైన సమయమని ఈ ఆఫర్లు చెప్పకనే చెబుతున్నాయి.

    వివరాలు 

    'బాస్' క్యాంపెయిన్ లో భాగంగా లభ్యమయ్యే ప్రయోజనాలు

    బాస్ ధరలు: ఓలా S1 పోర్ట్‌ఫోలియో కేవలం రూ. 74,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

    బాస్ డిస్కౌంట్లు: మొత్తం S1 పోర్ట్‌ఫోలియోపై రూ. 20,000 వరకు తగ్గింపు.

    రూ. 25,000 విలువైన అదనపు ప్రయోజనాలు

    బాస్ వారంటీ: రూ. 7,000 విలువైన 8 ఏళ్ల/80,000 కిమీ బ్యాటరీ వారంటీ ఉచితంగా.

    బాస్ ఫైనాన్స్ ఆఫర్లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు ఫైనాన్స్ ఆఫర్లు.

    అదనపు బాస్ ప్రయోజనాలు: రూ. 6,000 విలువైన ఉచిత MoveOS+ అప్‌గ్రేడ్; రూ. 7,000 విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్స్.

    వివరాలు 

    #HyperService క్యాంపెయిన్

    ఓలా ఎలక్ట్రిక్ తన విస్తృతమైన S1 పోర్ట్‌ఫోలియోలో మొత్తం ఆరు ఉత్పత్తులను అందిస్తుంది.ఇవి వివిధ అవసరాలు ఉన్న వినియోగదారులకు ఆకర్షణీయమైన ధరలతో అందుబాటులో ఉన్నాయి.

    S1 Pro మరియు S1 Air వంటి ప్రీమియం ఉత్పత్తులు వరుసగా రూ. 1,34,999 మరియు రూ. 1,07,499 వద్ద లభిస్తాయి.

    మాస్ మార్కెట్ కోసం S1 X సిరీస్ (2 kWh, 3 kWh, ,4 kWh) ను రూ. 74,999, రూ. 87,999, రూ. 1,01,999 లో కొనుగోలు చేయవచ్చు.

    ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల #HyperService క్యాంపెయిన్ ను ప్రారంభించింది.

    ఈ క్యాంపెయిన్ లో భాగంగా,కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

    వివరాలు 

    రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ సిరీస్

    అంతేకాకుండా,భారతదేశమంతటా తన విక్రయాలు,సేవా నెట్‌వర్క్‌ను విస్తరించడానికి 'నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌'ను ప్రకటించింది.

    2025 చివరి నాటికి 10,000 నెట్‌వర్క్ కేంద్రాలను స్థాపించాలన్నది ఓలా ఎలక్ట్రిక్ యోచన.

    అదనంగా,ఈవీలకు సంబంధించి 100,000 థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వడానికి ఓలా లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా దేశవ్యాప్తంగా ఈవీ సేవలను విస్తరించగలుగుతుంది.

    ఆగస్టు 2024లో జరిగిన వార్షిక 'సంకల్ప్'ఈవెంట్‌లో,ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ సిరీస్‌ను విడుదల చేసింది.

    ఈ సిరీస్‌లో రోడ్‌స్టర్ X (2.5 kWh, 3.5 kWh, 4.5 kWh),రోడ్‌స్టర్ (3.5 kWh, 4.5 kWh, 6 kWh),రోడ్‌స్టర్ ప్రో (8 kWh, 16 kWh) మోడల్స్ ఉన్నాయి. వాటి ప్రారంభ ధరలు వరుసగా రూ. 74,999 నుండి రూ. 1,99,999 వరకు ఉంటాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓలా

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' దాడులకు సంబంధించిన కొత్త వీడియోను షేర్ చేసిన భారత సైన్యం  ఆపరేషన్‌ సిందూర్‌
    Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ జో బైడెన్
    Motivation : మనల్ని మనం జయించగలిగితేనే ప్రపంచాన్ని జయించగలం జీవనశైలి
    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్

    ఓలా

    ఐదుగురు ట్విటర్‌ వినియోగదారులు ఓలా S1 హోలీ ఎడిషన్‌ను గెలుచుకునే అవకాశం స్కూటర్
    EV Chargers: ఓలా, ఎథర్, హీరో, టీవీఎస్ కస్టమర్లకు డబ్బు రీఫండ్ ఎలక్ట్రిక్ వాహనాలు
    Ola S1 Air : ఓలా ఎస్​1 ఎయిర్​లో ఫీచర్స్ మాములుగా లేవుగా..! ఎలక్ట్రిక్ వాహనాలు
    ఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025