Renault India: వాహన ధరలను పెంచిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలను పెంచుతున్నాయని ప్రకటిస్తున్నాయి.
ఇప్పటికే మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, కియా ఇండియా, హ్యుందాయ్, హోండా తదితర కంపెనీలు వచ్చే నెల నుంచి కార్ల ధరలు పెరుగుతాయని స్పష్టం చేశాయి.
తాజాగా రెనో ఇండియా (Renault India) కూడా ధరల పెంపును ప్రకటించింది. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.
వివరాలు
2023 ఫిబ్రవరి తర్వాత.. రెనో ఇండియా కార్ల ధరలను పెంచడం ఇదే మొదటిసారి
తయారీ వ్యయం, ముడి సరుకుల ధరలు, నిర్వహణ ఖర్చులు పెరిగిన కారణంగా కార్ల ధరలను సుమారు రెండు శాతం మేర పెంచుతున్నట్లు రెనో ఇండియా సీఈఓ ఎండీ వెంకట్రామ్ తెలిపారు.
వినియోగదారులకు ఉత్తమమైన వాహనాలను అందించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
మోడల్‌ను బట్టి ధరల పెరుగుదల వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. 2023 ఫిబ్రవరి తర్వాత రెనో ఇండియా కార్ల ధరలను పెంచడం ఇదే మొదటిసారని కంపెనీ స్పష్టం చేసింది.