Page Loader
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి
టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‍జీ కారు లాంచ్.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 22, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటర్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ సీఎన్‌జీ వెర్షన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆల్ట్రోజ్ ఐసీఎన్ జీ పేరుతో ఈ కారును రిలీజ్ చేశారు. మొత్తం ఆరు వేరియంట్లలో ఈ కారు లభించనుంది. పాపులర్ హ్యాచ్ బ్యాక్ కారు ఆల్ట్రోజ్ కు సీఎన్ జీ వెర్షన్ ను టాటా మోటర్స్ తీసుకురావడం విశేషం. గతంలో టియాగో, టిగోర్ మోడళ్లకు టాటా మోటర్స్ సీఎన్‌జీ వెర్షన్‌ను తీసుకొచ్చింది. వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, వైర్లెస్ చార్జింగ్, ఎయిర్ ఫ్యూరిఫయర్ ఫీచర్లతో ఈ కారును అద్భుతంగా తీర్చిదిద్దారు.

Details

టాటా ఆల్ట్రోజ్ ధర ఎంతంటే..?

1.2 లీటర్ పెట్రోల్ రెవోట్రోన్ ఇంజిన్ ను ఈ కారు కలిగి ఉంది. అదే విధంగా 6,000 rpm వద్ద 73.5 పీఎస్ పవర్, 3,500 rpm వద్ద 103 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్‌ను ఇది జనరేట్ చేయనుంది. స్టాండర్ట్ ఆల్ట్రోజ్ తో పోలిస్తే ఈ కారు ఐసీఎన్‌జీ వెర్షన్ లో బూట్ స్పెస్ తక్కువగా ఉండనుంది. ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, ఎత్తును అడ్జస్ట్ చేసుకునే డ్రైవర్ సీట్ ను కలిగి ఉంది. ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ఫ్యూరిఫైర్ లాంటి ఫీచర్లతో ముందుకొచ్చింది. టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్‌జీ కారు ధరలు రూ.7.55 లక్షల నుండి రూ.10.55 లక్షల వరకూ ఉండనున్నాయి.