Page Loader
Tata Harrier: 620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్‌ ఈవీ.. హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ప్రైజ్‌ ఇవే!
620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్‌ ఈవీ.. హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ప్రైజ్‌ ఇవే!

Tata Harrier: 620 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్‌ ఈవీ.. హైదరాబాద్‌ ఆన్‌రోడ్‌ ప్రైజ్‌ ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్‌ మార్కెట్‌లోని ఎలక్ట్రిక్‌ వాహనాల విభాగంలో టాటా మోటార్స్‌కే పెద్దపీఠ ఉంది. నెక్సాన్‌ ఈవీ, పంచ్‌ ఈవీ, టియాగో ఈవీ,టిగోర్‌ ఈవీ వంటి మోడళ్లకు విపరీత డిమాండ్‌ ఉంది. తాజాగా టాటా మోటార్స్‌ నుంచి టాటా హారియర్‌ ఈవీని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్‌ కారు ధరలను సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌ లో టాటా హారియర్‌ ఈవీ ఆన్‌రోడ్‌ ధరలు ఇలా ఉన్నాయి టాటా హారియర్‌ ఈవీ అడ్వెంచర్‌ 65 : రూ. 22.58 లక్షలు అడ్వెంచర్‌ ఎస్‌ 65 :రూ. 23.32లక్షలు ఫియర్‌లెస్‌ ప్లస్‌ 65 :రూ. 25.24లక్షలు ఫియర్‌లెస్‌ ప్లస్‌ 75 :రూ. 26.47 లక్షలు ఎంపవర్డ్‌ 75 :రూ. 29.08 లక్షలు

Details

ఆన్‌రోడ్‌ ధరలు తేడా

ఈ విధంగా హైదరాబాద్‌ లో టాటా హారియర్‌ ఈవీ ధరలు రూ. 22.58 లక్షల నుంచి రూ. 29.08 లక్షల వరకు ఉంటాయి. ఎలాంటి డిస్కౌంట్‌లు లేదా ఆఫర్లు ఉంటే, ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది. ఎక్స్‌షోరూం vs ఆన్‌రోడ్‌ ధర సాధారణంగా ఏ వాహనానికి ఎక్స్‌షోరూం, ఆన్‌రోడ్‌ ధరలు తేడా ఉంటాయి. ఎక్స్‌షోరూం ధరను కంపెనీలు ప్రకటిస్తాయి, కానీ ఆన్‌రోడ్‌ ధర మాత్రం రాష్ట్రాల వారీగా పన్నులు, రిజిస్ట్రేషన్‌ ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కస్టమర్లు ఎక్స్‌షోరూం కాకుండా, ఆన్‌రోడ్‌ ధరని పరిశీలించడం ద్వారా సరైన బడ్జెట్‌ వేసుకోవచ్చు.

Details

టెస్ట్‌ డ్రైవ్‌ & ఆఫర్లు 

తమ సమీప టాటా డీలర్‌షిప్‌ షోరూంకి వెళ్లి టెస్ట్‌ డ్రైవ్‌ చేసి, డిస్కౌంట్‌లు, ఆఫర్లపై పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తద్వారా మీ బడ్జెట్‌ని అనుగుణంగా ప్లాన్‌ చేసుకోవచ్చు. టాటా హారియర్‌ ఈవీ బుకింగ్స్‌ జులై 2 నుంచి ప్రారంభం 75 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 620 కి.మీ రేంజ్‌ అందిస్తుందనే అంచనాలున్నాయి. ఫాస్ట్‌ ఛార్జర్‌తో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌ ద్వారా 250 కి.మీ వరకు ప్రయాణించడం సాధ్యమని సంస్థ తెలిపింది. 120 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 20-80 శాతం ఛార్జింగ్‌ కేవలం 25 నిమిషాల్లో పూర్తి అవుతుంది.