Loading...
Tesla Cybertruck: ఈవీ పికప్ మార్కెట్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ వెనుకడుగు...కారణమేంటి?
ఈవీ పికప్ మార్కెట్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ వెనుకడుగు...కారణమేంటి?

Tesla Cybertruck: ఈవీ పికప్ మార్కెట్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ వెనుకడుగు...కారణమేంటి?

వ్రాసిన వారు Balachander Sharma
Nov 10, 2026
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కుల మార్కెట్‌లో టెస్లా సైబర్‌ట్రక్ ప్రయాణం ముగింపు దశకు చేరుకుంటోంది. 2027లో ఈ మోడల్ ఉత్పత్తిని నిలిపివేయాలని టెస్లా నిర్ణయించినట్లు సమాచారం. అమెరికాలోని టెక్సాస్‌ ఆస్టిన్‌ ప్లాంట్‌లో ప్రస్తుతం ఉన్న ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత, 2027 జూన్ లేదా జూలై నాటికి అసెంబ్లీ లైన్‌ను తొలగించనున్నట్లు ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఆ స్థానంలో వాణిజ్య విక్రయాలు ఇంకా ప్రారంభం కాని సైబర్‌క్యాబ్ రోబోట్యాక్సీల తయారీని పెంచాలని కంపెనీ భావిస్తోంది.

Details

2.5 లక్షల లక్ష్యం.. 11,600కు పరిమితమైన అమ్మకాలు

సైబర్‌ట్రక్‌పై తొలినాళ్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏడాదికి 2.5 లక్షల ట్రక్కులు విక్రయించవచ్చని మస్క్ గతంలో అంచనా వేశారు.

అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆటోమోటివ్ పరిశోధనా సంస్థ మోటార్ ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం, 2026 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ ట్రక్కుల అమ్మకాలు 28 శాతం తగ్గి సుమారు 11,600 యూనిట్లకు చేరాయి.

గత ఏడాది టెస్లా నుంచి స్పేస్‌ఎక్స్ కూడా 13.1 కోట్ల డాలర్ల విలువైన సైబర్‌ట్రక్కులను కొనుగోలు చేసినట్లు నియంత్రణ సంస్థకు సమర్పించిన పత్రాలు వెల్లడించాయి.

Details

ధర ఎక్కువ.. ఉపయోగం విషయంలో పరిమితులు

సైబర్‌ట్రక్‌ ఒక్కటే కాదు.. ఇతర కంపెనీల ఎలక్ట్రిక్ పికప్‌లకూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. భారీ బ్యాటరీల కారణంగా వీటి ధరలు ఎక్కువగా ఉంటున్నాయి.

ఉదాహరణకు, చేవ్రొలెట్ సిల్వరాడో ఈవీ ప్రారంభ ధర సుమారు 62,000 డాలర్లు. అంతేకాదు, గుర్రాల ట్రైలర్లు లాగడం, భారీ పరికరాలను తరలించడం వంటి పనుల్లో సంప్రదాయ పెట్రోల్, డీజిల్ పికప్‌ల స్థాయి పనితీరు అందించడం కూడా సవాలుగా మారుతోంది.

అంటే ఎక్కువ డబ్బు పెట్టి కొన్నా, ఆశించిన ఉపయోగం దక్కడం లేదన్నది కొనుగోలుదారుల అభిప్రాయం.

ADVERTISEMENT

Details

చిన్న ఈవీలు, హైబ్రిడ్ టెక్నాలజీ వైపు కంపెనీలు

ఈ పరిస్థితితో ఫోర్డ్, ఇతర వాహన తయారీ సంస్థలు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

ఫోర్డ్ ఎలక్ట్రిక్ ఎఫ్-150 లైట్నింగ్ ఉత్పత్తిని నిలిపివేసి, సుమారు 28,000 డాలర్ల ప్రారంభ ధరతో చిన్న ఎలక్ట్రిక్ పికప్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

మరోవైపు, స్టెల్లాంటిస్ పెట్రోల్ జనరేటర్ సాయంతో బ్యాటరీని రీఛార్జ్ చేసుకునే ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ పికప్‌ను 2027లో విడుదల చేయనుంది.

మొత్తానికి, భారీ బ్యాటరీలతో పెద్ద ట్రక్కుల కంటే తక్కువ ధర, మెరుగైన వినియోగ సామర్థ్యం ఉన్న మోడళ్లపైనే కంపెనీలు దృష్టి పెడుతున్నాయి.

ADVERTISEMENT