
Tesla electric car: ఇండియాలో టెస్లా ఎంట్రీ.. మోడల్ వై ఎలక్ట్రిక్ SUV గ్రాండ్ లాంచ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఎలాన్ మస్క్‌కి చెందిన ఈ దిగ్గజ సంస్థ, తమ హైడిమాండ్ ఎలక్ట్రిక్ SUV అయిన 'టెస్లా మోడల్ వై'ను అధికారికంగా ఇండియాలో విడుదల చేసింది. ప్రారంభ ధరను రూ. 59.89 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ముంబై) నిర్ణయించింది. తొలిసారి టెస్లా భారతదేశంలో తన డీలర్‌షిప్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ప్రారంభించింది. ఈ మోడల్ ఆర్‌డబ్ల్యూడీ (రియర్-వీల్-డ్రైవ్), లాంగ్ రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. టాప్ వేరియంట్ అయిన లాంగ్ రేంజ్ మోడల్ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించారు (ఎక్స్-షోరూమ్, ముంబై).
Details
అదనపు ఫీచర్ కోసం రూ.6 లక్షలు అదనంగా చెల్లించాలి
అయితే ఈ ధరల్లో పూర్తి స్థాయి ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కెపాసిటీ కలిగిన వేరియంట్ ఇవ్వడం లేదు. ఈ అదనపు ఫీచర్ కోసం వినియోగదారులు సుమారు రూ. 6లక్షలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం అందుబాటులో ఉన్న సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్లకు డ్రైవర్ శ్రద్ధగా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందని టెస్లా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. టెస్లా మోడల్ వై: డిజైన్ హైలైట్స్ టెస్లా మోడల్ 3 ప్లాట్‌ఫారంపై రూపొందించిన ఈ ఎస్‌యూవీ మోడల్ వై, పానోరమిక్ గ్లాస్ రూఫ్, కూపే లాంటి స్పోర్టీ శైలితో భారత మార్కెట్‌లో మినిమలిస్ట్ డిజైన్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సన్నని హెడ్‌ల్యాంపులు, ప్రాక్టికల్ ఫంక్షనాలిటీపై దృష్టి పెట్టిన ఏరోడైనమిక్ ఆకృతి ఉన్నాయి.
Details
టెస్లా మోడల్ వై: స్పెసిఫికేషన్లు
మోడల్ వైలో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి 60 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ: ఇది ఒక్కో ఛార్జ్‌తో సుమారు 500 కిలోమీటర్లు(WLTP ప్రమాణం ప్రకారం) రేంజ్ అందిస్తుంది. 75 కేడబ్ల్యూహెచ్ లాంగ్ రేంజ్ బ్యాటరీ: ఇది 622 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలదు. ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో 295 హెచ్‌పీ పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్ 0 నుంచి 100 కి.మీ వేగాన్ని కేవలం 5.9 సెకన్లలో చేరుతుంది. టెస్లా సూపర్‌ఛార్జర్ టెక్నాలజీ ద్వారా కేవలం 15 నిమిషాల్లో 238 నుండి 267 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను పొందొచ్చు.
Details
టెస్లా మోడల్ వై: ఫీచర్లు
భారత మార్కెట్‌లో మోడల్ వై వాహనం 7 రంగుల ఎంపికలు, 2 ఇంటీరియర్ ట్రిమ్ ఆప్షన్లు అందిస్తోంది. ముఖ్య ఫీచర్లలో: 15.4-ఇంచ్ ఫ్రంట్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ 8-ఇంచ్ రియర్ డిస్‌ప్లే పవర్ అడ్జస్టెబుల్ సీట్లు, 19-ఇంచ్ క్రాస్‌ఫ్లో వీల్స్ ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ అకౌస్టిక్ గ్లాస్, పవర్ రియర్ లిఫ్ట్‌గేట్ ఉన్నాయి. ఈ విధంగా టెస్లా మోడల్ వై భారత మార్కెట్‌లో తనదైన మినిమలిస్ట్ డిజైన్, అధునాతన టెక్నాలజీ, విశిష్ట ఫీచర్లతో కొత్త మైలురాయిని నెలకొల్పనుంది.